‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ ఖాతాలో సరైన హిట్టు పడలేదు. ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు ఈ రౌడీ హీరోకి పెద్ద షాకులే ఇచ్చాయి. ‘ఖుషి’ కొంచెం పర్వాలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసిన హిట్ సినిమా అయితే కాదు. అందుకే ఎన్నో ఆశలు పెట్టుకుని ‘కింగ్డమ్’ చేశాడు.
ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు షూటింగ్ ను ప్రారంభించలేదు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, పాటలు వంటివి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయి. ఈ సినిమాలో విజయ్ లుక్స్ కూడా పవర్ఫుల్ గా అనిపిస్తున్నాయి. నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది అనే ధీమాతో ఉన్నాడు.
ఇదిలా ఉండగా.. ‘కింగ్డమ్’ సినిమాని ఇప్పుడు హడావిడిగా రిలీజ్ చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా కారణంగా అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్ గా జూలై 31న రిలీజ్ చేస్తున్నారు. అంటే రిలీజ్ కి సరిగ్గా 20 రోజులు మాత్రమే టైం ఉంది. మరోపక్క ప్యాచ్ వర్క్ వంటి పనులు జరుగుతున్నాయి.
అందుకే పాన్ ఇండియా ప్రాజెక్టు అయినప్పటికీ.. హిందీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదట. ఈ మధ్య నార్త్ మార్కెట్ కూడా తెలుగు సినిమాకి కీలకం అయిపోయింది. పైగా విజయ్ కి నార్త్ లో క్రేజ్ ఉంది. అతని డిజాస్టర్ సినిమా ‘లైగర్’ అక్కడ బాగానే ఆడింది. ‘కింగ్డమ్’ వంటి మాస్ సినిమా కూడా అక్కడి ప్రేక్షకులకు నచ్చుతుంది. మరి నాగవంశీ ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారో.