‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘తండేల్’Thandel) . ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. చందూ మొండేటి Chandoo Mondeti) దర్శకుడు. బన్నీ వాస్ (Bunny Vasu) నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ (Allu Aravind) సహా నిర్మాతగా వ్యవహరించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం ఈ సినిమాకు మంచి బజ్ ను తీసుకొచ్చింది. మొదటి రోజు పాజిటివ్ టాక్ కూడా రావడంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.
రెండో రోజు, మూడో రోజు.. ఆల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 10.40 cr |
సీడెడ్ | 3.23 cr |
ఉత్తరాంధ్ర | 3.26 cr |
ఈస్ట్ | 1.83 cr |
వెస్ట్ | 1.41 cr |
కృష్ణా | 1.54 cr |
గుంటూరు | 1.44 cr |
నెల్లూరు | 0.82 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 23.93 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.52 cr |
ఓవర్సీస్ | 3.59 Cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 30.04 cr (షేర్) |
‘తండేల్’ (Thandel) చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ.30.04 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.96 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజు అంటే మొదటి సోమవారం ‘తండేల్’ ఎలా నిలబడుతుంది అనే దాన్ని బట్టి.. ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ను అంచనా వేసే ఛాన్స్ ఉంటుంది.