నిన్న జరిగిన ‘లైలా’ ప్రీ రిలీజ్ వేడుకలో 30 ఇయర్స్ పృథ్వీ తన పాత్ర గురించి చెబుతూ.. ‘150 మేకలు.. 11 మేకలు’ అంటూ వైసీపీ శ్రేణులకు చురకలు అంటించాడు. దీంతో ఈ సినిమాని బ్యాన్ చేయాలని, ‘తండేల్’ కి పెట్టినట్టే.. మొదటి రోజు హెచ్.డి.ప్రింట్ లింక్ పెడతామని కొందరు సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ‘#BoycottLaila’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు స్పందించారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ… “పృథ్వీరాజ్ గారు మాట్లాడిన మాటలకి మేము క్షమాపణలు చెబుతున్నాము. ఆయన అలా మాట్లాడిన టైంలో మేము అక్కడ లేము. చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకి వెళ్ళాము. ఈవెంట్ మొత్తం అయిపోయాక తిరిగి ఇంటికి వెళ్లి చూస్తే.. ట్విట్టర్లో ‘బాయ్ కాట్ లైలా’ అనే హ్యాష్ ట్యాగ్ తో 25 వేల ట్వీట్లు పడ్డాయి. అవి చూసి మేము షాకయ్యాము. 14th మార్నింగ్ ‘లైలా హెచ్ డీ లింక్ పెడతా’ అంటూ బెదిరిస్తున్నారు. దయచేసి మా సినిమాని చంపేయకండి.
మేము కనుక పృథ్వీ గారు మాట్లాడే టైంలో అక్కడ ఉండుంటే కచ్చితంగా ‘ఇది మా సినిమా ఫంక్షన్.. దయచేసి పాలిటిక్స్ వద్దు’ అని చెప్పేవాళ్ళం. మా ప్రమేయం లేకుండా ఈ తప్పు జరిగింది. ఆయన చెప్పినట్టు సినిమాలో ఉండదు. అక్కడ అన్ని గొర్రెలు ఉంటాయి. ఏదేమైనా పొరపాటు జరిగింది కాబట్టి.. మేము క్షమాపణలు చెబుతున్నాం. దయచేసి మా సినిమాని చంపేయకండి” అంటూ విన్నవించుకున్నాడు.
నిర్మాత సాహు కూడా ‘ లైలా సినిమాని బ్యాన్ చేయాలంటూ’ వస్తున్న వార్తలు చూసి షాకైనట్టు చెప్పారు. దయచేసి సినిమాని చంపేయకండి అంటూ చెప్పి క్షమాపణలు చెప్పారు. మరోపక్క దీని వల్ల మీ సినిమాకు మరింత పబ్లిసిటీ జరిగింది కదా? అంటూ ఓ రిపోర్టర్ హీరో విశ్వక్ సేన్ వద్ద ప్రస్తావించగా. అందుకు విశ్వక్ సేన్ ” మీరు కూడా రూ.30, రూ.40 .. కోట్లు పెట్టి సినిమా తీయండి. అప్పుడు నేను కూడా బ్యాన్ అని రాస్తా..! అప్పుడు మీకు కమ్మగా ఉంటుందో.. మండుతుందో తెలుస్తుంది” అంటూ మండిపడ్డాడు.
మేం ఇంటికెళ్లే దాక అతనేం మాట్లాడాడో మాకు తెలియదు
సినిమాని చంపేయకండి #BoycottLaila అని 25 వేల ట్వీట్స్ ఏంటండీ ?#viswaksen #Liala pic.twitter.com/YQmTv624Am— Filmy Focus (@FilmyFocus) February 10, 2025