ఆ పాట వచ్చాక శోభిత ఫీలైంది: నాగచైతన్య ‘తండేల్‌’ జాతర విశేషాలు!

నాగచైతన్య (Naga Chaitanya)  కెరీర్‌లో అతి పెద్ద సినిమా అయిన ‘తండేల్‌’ (Thandel)  సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. పుష్పరాజ్‌ అలియాస్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun)  ఈవెంట్‌కి వస్తాడని ఊదరగొట్టిన టీమ్‌ ఆఖరి గంటల్లో తీసుకురాలేకపోయింది. ఆ విషయం పక్కన పెడితే ఈవెంట్‌లో నాగచైతన్య మాటల్లో భార్య శోభిత ధూళిపాళ గురించి చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి.

Thandel

నాగచైతన్య – సాయి పల్లవి (Sai Pallavi)  జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి (Chandoo Mondeti)  దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మించారు. అల్లు అరవింద్‌ (Allu Aravind) సమర్పకులు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదిక మీద నాగచైతన్య మాట్లాడుతూ ఈ నిర్మాతలతో సినిమా చేయాలని ప్రతి నటుడి దగ్గర ఓ లిస్ట్‌ ఉంటుందని, అలా తన జాబితాలో గీతా ఆర్ట్స్‌ పేరు మొదట్లో ఉంటుందని చెప్పాడు.

‘తండేల్‌’ సినిమాలోని రాజు పాత్రకీ, నా నిజ జీవితానికీ చాలా తేడా ఉంటుందని చెప్పాడు నాగచైతన్య. ఈ పాత్రకి తగ్గట్టు మారడానికి నేను అడిగినంత సమయం ఇచ్చారని చెప్పారు. నా గురించి నా కంటే ఎక్కువగా ఆలోచించే దర్శకుడు చందు అని చెప్పాడు. సాయిపల్లవి లాంటి మరో నటిని నేను ఇప్పటివరకు చూడలేదని ఆమెను పొగిడేశాడు. సినిమాలో ఆమె బుజ్జితల్లి అయితే.. ఇంట్లో శోభితను (Sobhita Dhulipala)  బుజ్జితల్లి అని పిలుస్తా అని చెప్పాడు.

‘తండేల్‌’ సినిమాలోని బుజ్జి తల్లి పాట విడుదలయ్యాక శోభిత ఫీలైందని నాగచైతన్య చెప్పాడు. శోభితను బుజ్జితల్లి అని పిలుస్తుంటానని, ఆ పేరుతో సాంగ్‌ రావడంతో ఆమె హర్ట్‌ అయింది అంటూ నాగచైతన్య నవ్వేశాడు. అలాగే ఆ పాటను శోభితకు అంకితమిస్తున్నా అని కూడా చెప్పాడు. ఇక ఈ సినిమా శ్రీకాకుళం జిల్లాకి చెందిన డి.మత్స్యలేశం గ్రామ ప్రజలే ఈ సినిమాకి నిజమైన హీరోలు అని అన్నాడు. వాళ్లు లేకుండా ఈ సినిమా లేదు అని చైతు చెప్పాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus