అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘మనం’ తర్వాత వస్తున్న మూవీ ‘థాంక్యూ’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ వంటి క్రేజీ హీరోయిన్లు నటించిన మూవీ ఇది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. చాలా వరకు ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రోజు ఓన్ రిలీజ్ చేసుకోబోతున్నారు.
కొన్ని ఏరియాల్లో ఫాన్సీ రేట్లకు విక్రయించినట్లు ట్రేడ్ పండితుల సమాచారం. జూలై 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
8.50 cr
సీడెడ్
2.50 cr
ఉత్తరాంధ్ర
2.10 cr
ఈస్ట్
1.50 cr
వెస్ట్
1.20 cr
గుంటూరు
1.60 cr
కృష్ణా
1.30 cr
నెల్లూరు
0.65 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
19.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.80 cr
ఓవర్సీస్
2.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
23.85 cr
‘థాంక్యూ’ మూవీ రూ.23.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. క్లీన్ హిట్ అనిపించుకోవడానికి అంత మొత్తం రాబట్టాలి. నాగ చైతన్య నటించిన గత 4 సినిమాలు 30 కోట్లకి పైగా షేర్ ను రాబట్టాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. ‘థాంక్యూ’ కి మొదటి నుండి బజ్ లేకపోవడం పెద్ద మైనస్. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తే విశేషంగానే చెప్పుకోవాలి