నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా క్లాస్ ప్రేక్షకులకు నచ్చే మూవీ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విక్రమ్ కె కుమార్ ఈ సినిమాతో మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే ఈ సినిమా రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. అక్కినేని అభిమానులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకుందని సమాచారం అందుతోంది. దిల్ రాజు చైతన్యకు ఈ సినిమాతో కూడా నిర్మాతగా సక్సెస్ ఇవ్వలేకపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్, సన్ నెక్స్ట్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
50 రోజుల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ నుంచి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వరుసగా విజయాలు సాధిస్తున్న చైతన్యకు ఈ సినిమా రిజల్ట్ తో షాక్ తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
థమన్ బీజీఎం ఈ సినిమాకు ప్లస్ కాగా ఈ సినిమాలోని పాటలు మాత్రం ఆకట్టుకునేలా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థాంక్యూ సినిమా తుది ఫలితం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. చాలా ఏరియాలలో దిల్ రాజు సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేశారని సమాచారం అందుతోంది.