‘క్రాక్’ ‘ధమాకా’ సినిమాల సక్సెస్ కు.. అతనే కామన్ పాయింట్ అట..!

మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అతని సినిమా అనే సరికి కేవలం రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరి హీరోల అభిమానులు సపోర్ట్ చేస్తారు. కానీ కొన్నాళ్లుగా రవితేజ సినిమాల్లో ఏదో వెలితి. ఇక బాక్సాఫీస్ ఫలితాల గురించి చెప్పనవసరం లేదు. ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ‘డిస్కో రాజా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అతి ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

అయితే 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘క్రాక్’ మూవీ రవితేజ ప్లాపులకు బ్రేకులు వేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ‘క్రాక్’ తర్వాత మళ్ళీ రవితేజకి ‘ఖిలాడి’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి డిజాస్టర్లు పడ్డాయి. దీంతో ‘క్రాక్’ సక్సెస్ పై కూడా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఆ సినిమా సంక్రాంతి సీజన్ వల్ల గట్టెక్కేసింది అంటూ చాలామంది కామెంట్లు చేశారు.

అయితే డిసెంబర్ 23న ‘ధమాకా’ మూవీ రిలీజ్ అయ్యింది. ఇది కూడా గొప్ప సినిమా ఏమీ కాదు. అయినా సరే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది. రేపో మాపో ‘క్రాక్’ కలెక్షన్స్ ను కూడా అధిగమించడం ఖాయమనే చెప్పాలి. అయితే ఈ రెండు సినిమాల సక్సెస్ కు ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటి అంటే.. ‘క్రాక్’ ‘ధమాకా’.. ఈ రెండు సినిమాల్లోనూ దర్శకుడు బి.వి.ఎస్ రవి అతిథి పాత్ర పోషించడం.

ఇతను నటుడు అవుదామనుకుంటున్నాడో ఏమో తెలీదు కానీ ఈ రెండు సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి కాబట్టి.. ఇతను రవితేజ కు గోల్డెన్ లెగ్ గా మారిపోయాడు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ధమాకా’ దర్శకుడు త్రినాథరావు నక్కిన కంటే కూడా ఈ ప్లాప్ దర్శకుడికి ఎక్కువ పేరు వస్తుండటం విశేషం అనే చెప్పాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?<

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus