Balayya Babu: బాలయ్యతో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా!

నటసింహ నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ నుండి మాస్ ఆంథెమ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘జై బాలయ్య’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజుల్లోనే 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

2023 సంక్రాంతి బరిలోకి దిగబోతున్న ‘వీర సింహా రెడ్డి’ శరవేగంగా షూటింగ్ జరుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్ 8 నుండి బాలయ్య, శృతి హాసన్ మీద సాంగ్ తీయబోతున్నారు. రెండో వారం కల్లా గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే.. ‘వీర సింహా రెడ్డి’ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.తెల్ల పంచె, ముఖంపై గాయాలతో ఉన్న బాలయ్యతో కలిసి ఓ పూజారి తీసుకున్న పిక్ నందమూరి ఫ్యాన్స్ బాగా షేర్ చేస్తున్నారు.

దీంతో పంతులు గెటప్‌లో ఉన్న వ్యక్తి గురించిన వివరాలు తెలిశాయి. ఆ వ్యక్తి పేరు ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్.. ఆయన నటసింహ వీరాభిమాని.. పొద్దుటూరుకి చెందిన ప్రసాద్ రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్.. ‘వీర సింహా రెడ్డి’ లో బాలయ్యతో కలిసి నటించాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ, మోక్షజ్ఞ అభిమానులు ప్రసాద్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెట్టింట ఈ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య బాబు తండ్రీ కొడుకులుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఫాదర్ క్యారెక్టర్ పేరు ‘వీర సింహా రెడ్డి’ కాగా.. ఆయన తనయుడి పాత్ర పేరు ‘బాల నరసింహా రెడ్డి’ అని.. ఆ పాత్ర పరిచయ నేపథ్యంలోనే ‘జై బాలయ్య’ పాట వస్తుందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి సెంటిమెంట్‌ని దృష్టిలో పెట్టుకుని తమ హీరో సూపర్ హిట్ కొడతాడని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus