Prabhas: ఆ విషయంలో భయపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్..!

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా ప్రేక్షకులు సలార్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లరో ఈ సినిమా చూస్తామా అంటూ ఉవిళ్లూరుతున్నారు. ప్రభాస్ ని మరోసారి పాన్ వరల్డ్ రేంజ్ లో నిలబెట్టే సినిమా ఇది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పైగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కావడంతో అంచనాలు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పులేదని చెబుతున్నారు. మరోవైపు గ్లింప్స్ లో కేజీఎఫ్ తో సంబంధం ఉంది అంటూ సీన్స్ పడగా హైప్ మరో స్థాయికి వెళ్లిపోయింది.

ఇప్పుడు ఈ హైప్ మీదే అనుమానాలు, లేనిపోని భయాలను లేవనెత్తుతున్నారు. విషయం ఏంటంటే.. సలార్ కి పాన్ వరల్డ్ స్థాయిలో బీభత్సమైన హైప్ క్రియేట్ అయింది. ఒక్క అమెరికాలోనే అడ్వాన్స్ బుకింగ్ లో 5 లక్షల డాలర్లు దాటిపోయిందని చెబుతున్నారు. మిగిలిన చోట కూడా దాదాపుగా పరిస్థితి అలాగే ఉంది. ఇండియాలో అయితే ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభాస్ (Prabhas) స్టామినా ఏంటో, ప్రశాంత్ నీల్ క్యాలిబర్ ఏంటో యావత్ దేశానికి తెలుసు. ఆ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కూడా. అయితే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నట్లు చెబుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కే కబాలి సినిమా ఓవర్ హైప్ క్రియేట్ అయి బాక్సాఫిస్ వద్ద నిరాశ పరిచిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఎక్కువగా వస్తున్న ఈ హైప్ వల్ల సినిమాకి ఏమైనా మైనస్ అవుతుందా? అనుమానాలను వ్యక్త పరుస్తున్నారు.

అయితే నిజానికి ఇక్కడ ఆలోంచించాల్సిన విషయం ఏంటంటే.. ప్రభాస్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న మార్కెట్ ఏంటి? ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్ ఏంటి? ఈ రెండు విషయాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా ప్రేక్షకులు అంతా సలార్ సినిమాపై ఎలాంటి అపోహలు పెట్టుకోరు. ఎందుకంటే ఇద్దరూ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న వ్యక్తులు కాబట్టి ఈ సినిమా విజయంపై నిశ్చింతగా ఉండాలంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus