Veera Simha Reddy: ఆ పార్టీ వల్ల వీరసింహా రెడ్డి మూవీ హిట్ కానుందా?

ప్రముఖ రాజకీయ పార్టీలలో ఒకటైన టీడీపీ వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ కోసం కష్టపడుతోందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అఖండ సక్సెస్ తో టీడీపీలో జోష్ పెరగగా వీరసింహారెడ్డి మూవీ కూడా విజయాన్ని అందుకుంటే ఆ జోష్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరసింహారెడ్డి సినిమాలో ఏపీలోని అధికార పార్టీపై సెటైర్లు వేశారనే సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి ఈవెంట్ సక్సెస్ కావడం వెనుక పలువురు టీడీపీ నేతలు కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.

సినిమా కూడా సక్సెస్ సాధిస్తే పార్టీలో, కార్యకర్తల్లో ఊపు వస్తుందని పార్టీ మరింత పుంజుకుంటుందని పార్టీ కీలక నేతలు భావిస్తున్నారని సమాచారం. వీరసింహారెడ్డి సినిమాలో ప్రభుత్వ పథకాలపై కూడా సెటైర్లు ఉంటాయని ఆ డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది. టీడీపీ నేతలు ఎంతగానో కష్టపడుతున్న నేపథ్యంలో వీరసింహారెడ్డి విజయంలో వాళ్లు ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ రావాలని ఫ్యాన్స్ తో పాటు టీడీపీ నేతలు కోరుకుంటున్నారు.

సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సీడెడ్ లో వీరసింహారెడ్డి రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. మరోవైపు వీరసింహారెడ్డి విషయంలో జగన్ సర్కార్ ఏ విధంగా వ్యవహరించనుందనే చర్చ కూడా జరుగుతోంది. అఖండ సినిమాలో కూడా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాకు జగన్ సర్కార్ ఇబ్బందులు సృష్టించదని

అదే సమయంలో అదనపు ప్రయోజనాలు కూడా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. వీరసింహారెడ్డి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కగా కలెక్షన్ల విషయంలో కూడా హైయెస్ట్ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus