Pushpa Movie: సుకుమార్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’. నిన్న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్, ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్… నుండీ వచ్చిన చిత్రం కావడంతో పాండమిక్ ను కూడా పక్కన పెట్టి జనాలు పెద్ద ఎత్తున ‘పుష్ప’ని చూడడానికి వచ్చారు.

అయితే ఈ సినిమాలో సుక్కూ మార్క్ పెద్దగా కనిపించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో కథతో పాటు ట్రావెల్ అయ్యే పాత్రల తీరు కూడా ఆకట్టుకుంటుంది.అయితే చిట్టి బాబు పాత్ర మరింత హైలెట్ గా ఉంటుంది. ఆ సినిమాకి టెక్నికల్ టీం ఎఫర్ట్ కూడా ప్లస్ అయ్యింది.కానీ ‘పుష్ప’ లో ఒక్క అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్, కెమెరామెన్ పనితనం తప్ప మిగిలినవన్నీ తేలిపోయినవే. దాంతో రేపటి నుండీ కొన్ని సన్నివేశాల్ని తొలగించాలనే నిర్ణయానికి టీం వచ్చిందట.

ముందుగా ఈ చిత్రంలో ఫ్యామిలీస్ ను ఇబ్బంది పెట్టె ఓ సీన్ ఉంటుంది. పుష్ప రాజ్(అల్లు అర్జున్) తన కార్ లో శ్రీవల్లి(రష్మిక) తో పాటు కాసేపు రొమాంటిక్ గా మాట్లాడతాడు. ఈ క్రమంలో శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్ పై అతను చెయ్యి వేస్తాడు. ఆమె చెయ్యి తియ్యమని గొడవ చేసినా తీయడు. తర్వాత పుష్పకి కోపం వచ్చి తీసేస్తే మళ్ళీ శ్రీవల్లి ఆ చెయ్యి తన ప్రైవేట్ పార్ట్ పై పెట్టుకుంటుంది.

తర్వాత పుష్ప రాజ్ వెళ్ళిపోయాక.. శ్రీవల్లి బయటకి వస్తే.. వాళ్ళ అమ్మ టిఫిన్ చేసి వెళ్ళమంటుంది. పక్కనే ఉన్న శ్రీవల్లి ఫ్రెండ్… ఇప్పటి వరకు కార్లో చేసాడు లెండి చూస్తే తెలీడం లేదా అంటుంది. ఈ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వార్త సుకుమార్ వరకు చేరుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బంది పెట్టేలా ఉన్న ఈ సన్నివేశాన్ని వెంటనే డిలీట్ చేయాలని సుకుమార్ డిసైడ్ అయ్యాడట. రేపు అంటే ఆదివారం నుండీ ఈ సీన్ ను తొలగిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus