సినీ పరిశ్రమ రంగుల ప్రపంచం. ఇక్కడ వెలిగిపోయి ఎర్ర బస్సు ఎక్కి వచ్చినంత తేలిక కాదు నెగ్గుకు రావడం. అలా మద్రాస్, ముంబై రైళ్లు ఎక్కి తర్వాత అడ్రస్ లేకుండా పోయినోళ్లకు లెక్కే లేదు. అందుకే ఇండస్ట్రీలో ఎదిగిపోవాలంటే ‘‘ గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం’’ కూడా వుండాలి అని పెద్దలు ఊరకే అనలేదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రతి చోటా ప్రతిభావంతులకు కొదవ లేదు. ఇప్పుడు సూపర్‌స్టార్లుగా వెలుగొందుతున్న వారి కంటే కూడా అద్బుతమైన టాలెంట్ వుండి కూడా అట్టడుగున నిలిచిపోయిన వారు ఎందరో.
ఇందుకు చేతిలో అదృష్ట రేఖ లేకపోవడం కారణమని పెద్దల మాట. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి దురదృష్టవంతులు చాలా మందే వున్నారు. అలాంటి వారిలో జీవి నారాయణ రావు కూడా ఒకరు. సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి వారితో కలిసి నటనలో పాఠాలు నేర్చుకున్న ఆయన తొలినాళ్లలో తలైవా కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో వేసినా. అవి అంతగా ఆడకపోవడంతో చిన్నా చితకా పాత్రలు వేయాల్సి వచ్చింది. మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తాను తీయబోయే సినిమాకు రజినీకాంత్, జీ.వి.నారాయణ రావులను సెలక్ట్ చేసుకున్నారు. అలా తెరకెక్కిందే ‘‘ అంతులేని కథ ’’.
1976లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. జి.వి.నారాయణరావు సరసన జయపద్ర హీరోయిన్‌గా నటించగా.. రజనీకాంత్ ఆమెకు అన్నగా చేశారు. అంతులేని కథకు రజినీకాంత్ 1000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటే, నారాయణరావుకు 1500 ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గాను నారాయణ రావుకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఈరంకి శర్మ దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది అనే సినిమాలో మళ్లీ రజనీకాంత్, నారాయణరావు కలిసి నటించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ జోష్‌ను నారాయణ రావు కంటిన్యూ చేయలేకపోయారు. ఆయన తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇదే సమయంలో రజనీకాంత్ వరుస సూపర్‌హిట్‌లతో దక్షిణాదిలో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. సో… అది మరి అదృష్టం అంటే.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!