1980ల టైంలో చిరంజీవి, బాలకృష్ణ ల హవా ఎక్కువగా ఉండేది. ఎక్కువ బ్లాక్ బస్టర్లు కొడుతూ నెంబర్ 1 స్థానం కోసం ఎన్నో కసరత్తులు చేసేవాళ్ళు ఈ స్టార్ హీరోలు. వీళ్ళ సినిమాలకు స్టార్ హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చేయడం కూడా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఒకే హీరోయిన్ తో మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తూ ఉండేవాళ్ళు ఈ స్టార్ హీరోలు. విజయశాంతి, రాధ వంటి స్టార్ హీరోయిన్లు ఎక్కువగా చిరు,బాలయ్య సినిమాల్లో కనిపించేవారు.
పైగా మరోపక్క నాగార్జున, వెంకటేష్ లు కూడా హీరోయిన్ల కోసం వెయిటింగ్ లో ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో గౌతమి కూడా ఒకరు. నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో ఈమె ఎక్కువ సినిమాలు చేసింది. కానీ చిరు, బాలయ్య లకు జోడీగా ఈమె ఒక్క సినిమా కూడా చేయలేదు. అవకాశాలు వచ్చినా ఆ బడా హీరోలకు ఈమె జోడీగా చేయలేకపోయిందట. ఈ విషయం పై ఆమె స్పందిస్తూ..
“చిరంజీవి గారు .. బాలకృష్ణ గారి సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి. కానీ బ్యాడ్ లక్ అనుకోవాలో ఏమో కానీ ఆ టైంలో నేను డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాను. చిరంజీవి గారితో అయితే మూడు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. మూడు సార్లు కూడా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాను. 80వ దశకానికి చెందిన హీరో, హీరోయిన్స్ టీమ్ ప్రతి ఏడాది కలుస్తుంటారు.
నన్ను కూడా ఆహ్వానిస్తూనే ఉంటారు. అయితే నిజానికి వాళ్లంతా నా సీనియర్స్. వాళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అలాంటివారితో నేను సన్నిహితంగా మసులుకోలేను. అందువల్ల నేను ఆ మీట్ కు వెళ్లలేకపోతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?