టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా సినిమాలను నిర్మిస్తున్న బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కూడా ఒకటి. స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్లతో సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ టాప్ బ్యానర్లలో ఒకటిగా మైత్రీ మూవీ మేకర్స్ కొనసాగుతోంది. ఈ బ్యానర్ సినిమాలను భారీ బడ్జెట్లతో నిర్మిస్తూ అదే సమయంలో ఆ సినిమాలతో సక్సెస్ సాధించి భారీ లాభాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ వరుసగా ఈ బ్యానర్ లోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
శ్రీమంతుడు సినిమాతో ఈ బ్యానర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను నిర్మించడం మొదలుపెట్టి తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప ది రైజ్ ఈ సినిమాలు ఈ బ్యానర్ కు పాపులారిటీని మరింత పెంచాయి. శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో అప్పట్లో హైయెస్ట్ గ్రాసర్ కాగా జనతా గ్యారేజ్ కూడా 2016 సంవత్సరం నాటికి తారక్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఈ బ్యానర్ లో తెరకెక్కిన రంగస్థలం రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు చరణ్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. పుష్ప ది రైజ్ బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి హిందీలో కూడా బన్నీ మార్కెట్ ను పెంచింది. పుష్ప ది రైజ్ కు నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఇతర హీరోల తరహాలో బన్నీకి కూడా హైయెస్ట్ గ్రాసర్ ను పుష్ప సినిమాతో అందించి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వార్తల్లో నిలవడం గమనార్హం.
సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న బ్యానర్ కావడంతో ఈ బ్యానర్ లో తెరకెక్కే సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు.