ఆ బాలీవుడ్ ప్రేమ జంట విడిపోయిందా?

బాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ వ్యవహారాలు అనేవి సర్వ సాధారణం. వారు ఓపెన్ గానే ప్రేమికులతో చట్టా పట్టాలేసుకొని తిరుగుతారు. దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. వీరందరిలో లవర్ బాయ్ రన్బీర్ కపూర్ ప్రత్యేకం. ఇప్పటికే ఆయన చాల మంది బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడిపారు. దీపికా పదుకొనే, కత్రినా ఖైఫ్, ప్రియాంక చోప్రా అందులో కొందరు. ఈ చాక్లెట్ బాయ్ సీజన్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ని మైంటైన్ చేశారు. వీరందరిలో దీపిక పదుకొనె రన్బీర్ ని ఘాడంగా ప్రేమించింది. ఆయన ఆమెకు బ్రేక్ అప్ చెప్పాక చాల డిప్రెషన్ పేస్ చేసింది. ఈ విషయాలు దీపిక స్వయంగా చెప్పడం జరిగింది.

తాజాగా రన్బీర్, అలియా భట్ తో ప్రేమలో ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఈ జంట ఎక్కడ చూసిన కలిసి కనిపిస్తున్నారు. ఈ మధ్య వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను వారు ఖండించడం కూడా జరిగింది. ఐతే తాజా సమాచారం ప్రకారం వీరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల చేత పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట బ్రేక్ అప్ చెప్పడానికి సిద్దమైందట. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, బాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది. అలియా భట్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉంది. ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ కి హీరోయిన్ గా నటిస్తున్న ఈమె బ్రహ్మాస్త్ర వంటి మరో భారీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాస్త్ర సినిమాలో హీరో రన్బీర్ కపూర్ కావడం విశేషం.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus