సోషల్ మీడియా లో ఇప్పుడు ఎటు చూసిన నేషనల్ అవార్డ్స్ గురించే చర్చ. ఎన్నడూ లేని విధంగా ఈసారి టాలీవుడ్ కి ఏకంగా 10 విభాగాలలో అవార్డ్స్ వచ్చాయి. మొట్టమొదటిసారి చరిత్రలో బాలీవుడ్ ని పూర్తి స్థాయిలో డామినేట్ చేసేసింది టాలీవుడ్. అయితే అవార్డ్స్ దక్కించుకోలేకపోయింది కొంతమంది హీరోల అభిమానులు మాత్రం చాలా తీవ్రంగా బాధపడ్డారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకరు. వాళ్ళు బాధపడడం లో నిజంగా ఒక అర్థం ఉంది.
ఎందుకంటే మన టాలీవుడ్ నుండి రెండు సార్లు (National Award) నేషనల్ అవార్డ్స్ కి నామినేట్ అయిన ఏకైక హీరో గా రామ్ చరణ్ చరిత్ర సృష్టించాడు. 2018 వ సంవత్సరం లో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ‘రంగస్థలం’ చిత్రానికి, అలాగే 2022 వ సంవత్సరం లో ఎంతో న్యాచురల్ గా నటించి ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి నామినేట్ అయ్యాడు. ‘రంగస్థలం’ చిత్రానికి అవార్డు రాకపోవడం పై కేవలం రామ్ చరణ్ అభిమానుల్లో మాత్రమే కాదు, టాలీవుడ్ అభిమానులలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది.
ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలం లో ‘రంగస్థలం’ చిత్రం లో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులకు ఇచ్చిన సినిమాటిక్ అనుభవం ఏ హీరో కూడా ఇవ్వలేదు. అలాంటి నటన కి జాతీయ అవార్డు దక్కకపోవడం పై చాలా అసంతృప్తి ఉంది. ఇక ఆర్.ఆర్.ఆర్ చిత్రం లో కూడా రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. వివిధ రకాల షేడ్స్ ఉన్న రామరాజు పాత్ర ని ఎంతో సహజ నటనతో రామ్ చరణ్ వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ రెండు చిత్రాలకు అవార్డ్స్ రాకపోవడానికి రామ్ చరణ్ పొరపాట్లు కూడా కొన్ని ఉన్నాయ్.
అదేమిటంటే రెండు సినిమాలకు కూడా ఆయన నేషనల్ అవార్డ్స్ దక్కించుకునే రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ, దానికి తగ్గ క్యాంపైన్ చెయ్యకపోవడం వల్లే రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్స్ త్రుటి లో మిస్ అయ్యాయి అని విశ్లేషకుల అభిప్రాయం. రామ్ చరణ్ ఇలాంటివి మొదటి నుండి అసలు పట్టించుకోడని, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పీఆర్ టీం ఉండుంటే నేడు రెండు సార్లు నేషనల్ అవార్డు ని దక్కించుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించి ఉండేవాడని అంటున్నారు.