బిగ్ బాస్ హౌస్ లో మూడో కంటెస్టెంట్ గా వచ్చిన లహరి మూడోవారమే ఎలిమినేట్ అయిపోతుందని అస్సలు ఊహించలేదు. ఇదే విషయాన్ని నాగార్జునతో స్టేజ్ షేర్ చేస్కున్నప్పుడు చెప్పింది లహరి. ఇంకొన్నాళ్లు గేమ్ ఆడేదాన్ని అని, ఇప్పుడు వెళ్లిపోవడం అనేది బాధగా ఉందని చెప్పింది. అసలు లహరి ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానంగా 5 కారణాలు మనం చూసినట్లయితే.,
1. మొదటివారంలో లహరికి అనుకున్నంత స్క్రీన్ స్పేస్ దొరకలేదు. చిన్న చిన్న విషయాల్లో కాజల్ తో ఆర్గ్యూమెంట్ చేయడం, ఇరిటేట్ అవ్వడం లాంటివి చేసింది. హమీదా తో ఆర్యూమెంట్ అయిన తర్వాత హౌస్ లో వీరిద్దరినీ నామినేట్ చేసింది లహరి. అంతేకాదు, ఫస్ట్ వీక్ లో తనకి పెర్ఫామ్ చేసే స్కోప్ కూడా ఎక్కడా దొరకలేదు. కనీసం కెప్టెన్సీ టాస్క్ లో ఎవరికి సపోర్ట్ చేస్తుందో కూడా క్లారిటీగా చెప్పుకోలేకపోయింది.
2. రెండోవారం కూాడ టైమ్ వేస్ట్ చేసుకుంది లహరి. తానేంటో నిరూపించుకోవాల్సి వచ్చిన అవకాశాలు సైతం వదలేసుకుంది. వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకునేటపుడు కానీ, అలాగే సెట్ కట్ చేసుకునేటపుడు రీజన్స్ చెప్పేవి కానీ పొంతన లేకుండా పోయాయి. నామినేషన్స్ అప్పుడు చెప్పిన రీజన్స్ కూడా అంత వాలిడ్ గా అనిపించలేదు. నిజానికి గేమ్ ఆడేటపుడు ఏదైనా ఇష్యూలో అక్కడికక్కడే తేల్చుకోవాలి. అక్కడ ఫెయిల్ అయ్యింది లహరి.
3. వేరే హౌస్ మేట్స్ అందరూ స్మార్ట్ గేమ్ ఆడుతుంటే తను స్ట్రాటజీలని మార్చుకోలేకపోయింది. ముక్కుసూటిగా మాట్లాడటం, ఏదనిపిస్తే అదే చేయడం అనేది లహరికి మైనస్ అయ్యింది. వేరేవాళ్లు ఏం చేస్తున్నారు అనేది మనకి అనవసరం అనే ధోరణి లహరి గేమ్ ని దెబ్బతీసింది. తాను ఆడిన గేమ్ కరెక్ట్ గా ఉన్నా వేరే వాళ్ల గేమ్ ని తను ఎనలైజ్ చేయలేకపోయింది. తనకంటే స్పీడ్ గా ఎవరు ముందుకు వెళ్తున్నారో గమనించుకోలేపోయింది.
4. బిగ్ బాస్ హౌస్ లో మూడు వారాలు గడిచినా కూడా తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేయలేకపోయింది. అంతేకాదు, హౌస్ లో అందర్నీ కలుపుకోవడంలో విఫలం అయ్యింది లహరి. ముఖ్యంగా కాజల్, హమీదాలు మొదటివారంలో దెబ్బకొడితే, రెండోవారంలో తన గేమ్ తనకి మైనస్ అయ్యింది. హమీదా విషయంలో జస్ట్ చిన్న మేటర్లో ఇద్దరూ ఒకరినొకరు నామినేట్ చేస్కోవడం అనేది సిల్లీగా మారింది. లహరి గేమ్ లో సీరియస్ నెస్ లేకుండా పోయింది.
5. అందివచ్చిన అవకాశాన్ని సైతం వదిలేసింది. జెస్సీతో కెప్టెన్సీ టాస్క్ కోసం ఆర్గ్యూమెంట్ పెట్టుకోవాల్సిన టైమ్ లో ఆప్షన్ లేదంటూ గివ్ అప్ చేసేసింది. అంతేకాదు, నామినేషన్స్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో రావడం అనేది లహరికి పెద్ద మైనస్ అయ్యింది. తనకంటే ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తెచ్చుకోవడం వల్ల మిగతా వాళ్ల కంటే వీక్ అయిపోయింది లహరి. ఇక నామినేషన్స్ లో ఉన్నప్పుడు చూపించాల్సిన ఎగ్రెసివ్ గేమ్ ని చూపించలేకపోయింది.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!