‘అఖండ’ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ‘క్రాక్’ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన మూవీ ‘వీరసింహారెడ్డి’. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా నటించారు. సినిమా రిలీజ్ కు ముందు వరకు హీరోయిన్ గా ఎక్కువ శృతి హాసన్ పేరే ప్రచారమైంది. ఈ సినిమా కోసం ఎక్కువగా ఆమెకే ఎక్కువ పారితోషికం అందింది. పైగా యూత్ లో ఆమెకు గల క్రేజ్ కూడా వేరు.
అందుకే శృతి హాసన్ నే హీరోయిన్ గా ఎక్కువ ప్రమోట్ చేశారు. కానీ ‘వీరసింహారెడ్డి’ మెయిన్ రోల్ కాబట్టి.. అతని భార్య పాత్రలో హనీ రోజ్ కనిపించింది. నిజానికి శృతి హాసన్ పాత్ర కంటే ఈమె పాత్రకే ప్రాముఖ్యత ఎక్కువని చెప్పాలి. ఓ పక్క ‘వీరసింహారెడ్డి’ భార్య మీనాక్షిగా మరోపక్క ‘జై సింహారెడ్డి'( చిన్న బాలకృష్ణ) కి తల్లిగా ఈమె చాలా బాగా నటించింది. రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించింది.
శృతి హాసన్ పాత్ర సినిమాలో ఏదో పెట్టాలని పెట్టారు అని చాలామంది కామెంట్లు చేశారు. ఆమె పాత్రకు తలా… తోక లేదు అనే కామెంట్లు కూడా ఎక్కువ వినిపించాయి. అయితే ప్రమోషన్ కోసం అలాంటి స్టార్ హీరోయిన్ అవసరం. కాబట్టి తప్పలేదు.. అందులో తప్పు కూడా లేదు. కానీ నిజ జీవితంలో శృతి హాసన్ కంటే హనీ రోజ్ వయసులో చిన్నదట. సినిమాలో ఆమెకు అత్త పాత్ర ఇచ్చారు.. శృతి హాసన్ కు కోడలి పాత్ర ఇచ్చారు.
లుక్స్ లో కూడా హనీ రోజ్ పెద్దమ్మాయిలా కనిపిస్తుంది. కాబట్టి.. ముందు ముందు ఈమెకు మంచి పాత్రలు రావాలి అంటే కనుక ఈమె కొంచెం సన్నబడాలి అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిజమే మరి..’వీరసింహారెడ్డి’ తో హనీ రోజ్ కు ఏర్పడ్డ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలి అంటే ఆమె కొంచెం ఫిజిక్ పై దృష్టి పెట్టాలి !