Bigg Boss Finale: మానస్ అండ్ శ్రీరామ్ ఇద్దరూ ఎన్ని లక్షలు చేజార్చుకున్నారో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అనేది అత్యంత నాటకీయంగా సాగింది. ఫస్ట్ రౌండ్ లో రష్మిక్ ఇంకా దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ వచ్చి సిరిని ఎలిమినేట్ అయ్యిందని చెప్పి తీసుకుని వెళ్లారు. ఇక్కడే డ్రోన్స్ సహాయంతో ఎలిమినేషన్ ని చాలా గ్రాండ్ గా చూపించారు. ఆ తర్వాత నేచరల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ టీమ్ తో సహా హౌస్ లోకి వెళ్లాడు. సిల్వర్ బాక్స్ లో కొంత క్యాష్ ని తీస్కుని వెళ్లి నలుగురు ముందు పెట్టాడు.

అసలు ఆ బ్రీఫ్ కేస్ లో ఎంత ఉంది అనేది చెప్పకుండానే వాళ్లని టెమ్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మానస్, ఇంకా సన్నీ ఇద్దరూ కూడా మాకు ప్రజల ఓట్లే ముఖ్యమని ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే అని చెప్పారు. అంతేకాదు, మరోవైపు షణ్ముక్ జస్వంత్ ఇంకా శ్రీరామ్ చంద్ర కూడా ఇదే తరహాలో ఉన్నారు. అయితే, ఇప్పుడు నాని తీస్కుని వచ్చిన బ్రీఫ్ కేస్ లో ఎంతుంది

అనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ పంపిన సిల్వర్ బాక్స్ లో 10లక్షలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కానీ, మానస్ ఎలిమినేట్ అయిన తర్వాత, కబడ్డీ ప్రో లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చిన నాగచైతన్య గోల్డెన్ బాక్స్ లని టాప్ 3 ముందు ఉంచుతూ అందులో చాలా మొత్తం ఉందని చెప్పాడు. నాని తెచ్చిన దానికంటే మూడురెట్లు డబ్బు ఉందని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, ముగ్గురూ కూడా డబ్బు తీస్కునేటట్లుగా కనిపించలేదు.

టైటిల్ ట్రోఫీని ముద్దాడాలని అనుకున్నారు. దీంతో కాసేపు గోల్డెన్ బాక్స్ తో గేమ్ ఆడిన నాగార్జున శ్రీరామ్ చంద్రని ఎలిమినేట్ చేశాడు. శ్రీరామ్ ఎలిమినేట్ అవ్వగానే సన్నీ షాక్ తిన్నాడు. నిజానికి శ్రీరామ్ చంద్రని బిగ్ బాస్ టీమ్ లాస్ట్ వరకూ ఉంచి ఉండాల్సింది. కానీ, అలా చేయలేదు. ఇక శ్రీరామ్ ఎలిమినేట్ అయిన తర్వాత గోల్డెన్ బాక్స్ లో 20 లక్షలు ఉన్నాయని చెప్పాడు నాగ్. దీంతో 20 లక్షలు శ్రీరామ్ చంద్ర, 10 లక్షలు మానస్ చేజార్చుకున్నట్లుగా అయ్యింది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus