69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైన ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచే కావడం నార్త్ ఆడియన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. గంగూబాయ్ కటియవాడిలో టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కు గాను అలియా భట్, మిమిలో అదిరిపోయే నటన ప్రదర్శించినందుకు కృతి సనన్ ని కమిటీ గుర్తించింది. ఒకరు ఆర్ఆర్ఆర్ లో సీతగా నటిస్తే మరొకరు ఆదిపురుష్ లో రామసతి సాధ్విమణిగా మెప్పించింది. కాకతాళీయమే అయినప్పటికీ తక్కువ గ్యాప్ లో ఇద్దరూ సీత పేరుతో పాత్రల్లో కనిపించడం విశేషం. అలియా భట్ విషయానికొస్తే.. అందంతో అదరగొట్టడం…అభినయంతో కట్టిపడేయడం…
ఈ రెండూ.ఆమెకు వెన్నతో పెట్టిన విద్యలు. దర్శకుడు మహేష్‌భట్ కుమార్తెగా హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినా తక్కువకాలంలోనే తనేంటో నిరూపించుకుంది. ఆమే ప్రముఖ కథానాయిక అలియాభట్. ఇప్పటికే పలు పురస్కారాలు గెలుచుకున్న ఆమె తాజాగా ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ‘గంగూబాయి కాఠియావాడి’లో వేశ్య పాత్రలోని ఆమె నటన జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో గంగూగా అలియా నటన అందర్నీ కట్టిపడేసింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియా నటన అందర్నీ కట్టిపడేసింది.
‘సంఘర్ష్’ సినిమాతో బాలనటిగా అడుగుపెట్టిన ఆమె ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో కథానాయికగా నట జీవితాన్ని ప్రారంభించింది. తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. సినీరంగంలో రాణిస్తోంది. పాత్ర కోసం ఎంత కష్టానికైనా సై అనే కృతి.. చాలా మంది అందాల భామలు అగ్రస్థానంలో ఉండాలనే కలలతో సినీరంగంలో అడుగుపెడతారు. కానీ.. చిత్రపరిశ్రమలోకి రావడం నా డ్రీమ్ కాదు.. అనుకోకుండా వచ్చాను అని చెప్పే కృతిసనన్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. సరోగేటెడ్ తల్లిగా ‘మిమీ’లో ఆమె నటన ఆకట్టుకుంది.
ఇప్పుడు ఆ చిత్రంలో పోషించిన మిమీ రాథోడ్ పాత్రకే జాతీయ (National Award) ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది కృతి. తొలి సినిమా ‘వన్ నేనొక్కడినే’లో అగ్రకథానాయకుడు మహేష్‌బాబు సరసన ఆడిపాడింది. ‘హీరోపంటి’తో విజయవంతమైన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘దిల్‌వాలే’ ‘లుకా ఛుపీ’, ‘బరేలీ కీ బర్ఫీ’, ‘హౌస్‌ఫుల్ 4’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి. గ్లామర్ పాత్రలతో పాటు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఈ ఏడాది ‘ఆదిపురుష్’ చిత్రంలో జానకిగా ప్రేక్షకుల్ని పలకరించింది. ఇటీవలే చిత్రనిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది కృతిసనన్.
గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!
బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!