The Ghost Twitter Review: క్లాస్ తో పాటు మాస్ ను కూడా మెప్పించే విధంగా ‘ది ఘోస్ట్ ‘!

‘బంగార్రాజు’ ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలతో ఫామ్లో ఉన్న అక్కినేని నాగార్జున… ఇప్పుడు ‘ది ఘోస్ట్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ మూవీగా ‘ది ఘోస్ట్’ రూపొందింది. ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

టీజర్, ట్రైలర్ వంటి వాటికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. దీంతో సినిమా పై కొద్దిపాటి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, నాగార్జున ఇంట్రో సీన్.. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొదట కొంచెం స్లోగా ఉన్నా తర్వాత పికప్ అయ్యిందని, అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో చాలా ఎంగేజ్ చేసే విధంగా ఉందని చెబుతున్నారు.

పాటలు సందర్భానుసారంగా ఉన్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అలరిస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొత్తానికి ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అని,. నాగార్జున తన బెస్ట్ ఇచ్చాడని, ప్రవీణ్ సత్తార్ టేకింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. వీరి టాక్ ప్రకారం ఈ ఏడాది నాగార్జున ఖాతాలో మరో హిట్ పడినట్టే అని స్పష్టమవుతుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus