తెలుగు సినీ గోయర్స్‌కు భాషతో సంబంధం ఉండదు. ఏ భాష నుండి సినిమా మన దగ్గరకు వచ్చినా ఆదరించేస్తుంటారు. అందుకునేమో మన దగ్గర పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చినా.. ఇతర భాషల నుండి సినిమాలు వచ్చినప్పుడు జనాలు చూస్తుంటారు. థియేటర్లు, స్క్రీన్లు కూడా ఇచ్చేస్తుంటారు. అయితే మన సినిమాలు ఆయా ఇండస్ట్రీలకు వెళ్లినప్పుడు ఆ స్థాయిలో థియేటర్లు దొరకవు అనే వాదన చాలా ఏళ్లుగా ఉంది. అందుకే మన సినిమాలకు వస్తున్న కష్టం..
The Greatest Of All Time
వాళ్లకెప్పుడు తెలుస్తుంది అనే మాట చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కన్నడ సినిమా పరిశ్రమకు కాస్త ఈ విషయంలో క్లారిటీ వచ్చింది అని చెప్పొచ్చు. కన్నడనాట తాజాగా ‘ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి’ అనే సినిమా విడుదలైంది. రక్షిత్ శెట్టి (Rakshit Shetty) స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాతగా చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు బెంగళూరులో చాలినన్ని థియేటర్లు దొరకలేదు.
ఏమైందా అని చూస్తే.. మెజారిటీ థియేటర్లు, షోలను తమిళ సినిమా ‘ది గోట్’ (The Greatest of All Time) సినిమాకు ఇచ్చేశారు. ఆ సినిమాకు మంచి టాక్ రాకపోయినా.. తొలి రోజుల్లో అయితే స్క్రీన్లు కంటిన్యూ చేశారు. దీంతో మన సినిమాకు కాకుండా, వేరే భాషల సినిమాలకు స్క్రీన్లు, షోలు ఇస్తే ఎలా అనే ప్రశ్న కన్నడనాట మొదలైంది. దీంతో ఇప్పుడు అర్థమైందా మా పరిస్థితి అని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు.
నిజానికి కన్నడనాట ఈ పరిస్థితి చాలా ఏళ్లుగా ఉంది. అక్కడి సినిమాకు చాలా ఏళ్లుగా సొంత ప్రాంతంలోనే థియేటర్లు దొరకవు అనే అపవాదు ఉంది. అయితే అక్కడి సినిమాలు మన దగ్గరకు వస్తే ఈజీగానే థియేటర్లు దొరికే పరిస్థితి ఉంది. వాళ్ల ఏరియాలోనే వాళ్లకు థియేటర్లు దొరకని పరిస్థితుల్లో మనం ఎందుకు ఈజీగా థియేటర్లు ఇచ్చేయడం, అది కూడా మన సినిమాలను కాదని.. ఇప్పుడు ఈ చర్చే నడుస్తోంది తెలుగు సినిమా రంగంలో.