బిగ్ బాస్ సీజన్ – 7 ఉల్టా పుల్టా అంటూ చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఈసారి హౌస్ మేట్స్ ని కన్ఫూజ్ చేస్తూ చాలా టాస్క్ లు పెట్టారు. హౌస్ లోకి పంపించే ముందు మీరు కేవలం కంటెస్టెంట్స్ గా మాత్రమే సెలక్ట్ అయ్యారని, కన్ఫార్మ్ కాలేదని, హౌస్ మేట్స్ గా కన్ఫర్మేషన్ రావాలంటే పవర్ సంపాదించుకోవాలి ఒక పవర్ హౌస్ బొమ్మని చూపించారు. దీంతో హౌస్ మేట్స్ తమ ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి సీజన్ లో చూస్తే చాలా హైలెట్స్ కనిపిస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ – 7 హైలెట్స్ :
* ఈసారి సీజన్ లో హౌస్ లో ఎలాంటి ప్రాపర్టీస్ లేవు. వాటిని హౌస్ మేట్స్ టాస్క్ ఆడి గెలుచుకోవాల్సి వచ్చింది. అలాగే, విజయ్ దేవరకొండలాంటి సెలబ్రిటీ ఈసారి ఫస్ట్ డేనే హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ ని పలకరించారు.
* ఈసారి సీజన్ లో హౌస్ మేట్స్ కి డిఫరెంట్ టాస్క్ లు ఇచ్చారు. అంతేకాదు, పవర్ గెలుచుకుంటేనే హౌస్ లో ఉంటారని చాలా నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇందులో టేస్టీ తేజ, హీరో గౌతమ్ కృష్ణ, హీరోయిన్ రితిక ముగ్గురికీ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్.
* షకీలా, కిరణ్ రాధోడ్, శివాజీ లాంటి సీనియర్స్ ని ఈసారి సీజలోకి తీసుకుని వచ్చారు.
* టాస్క్ లు పరంగా కానీ, కాన్సెప్ట్ పరంగా కానీ కొత్తగా షో ని డైజన్ చేశారు. దీంతో హౌస్ మేట్స్ కి ఏది ఉల్టా అవుతుందో, ఏది పుల్టా అవుతుందో అర్ధం కాని పరిస్థితి వచ్చింది. దీంతో టాస్క్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే హౌస్ మేట్స్ కి చుక్కలు కనిపించేలాగానే ఉన్నాయి.
* ఈసారి హాలో గ్రామ్ దర్శిని ద్వారా నాగార్జున ఏనీ టైమ్ హౌస్ మేట్స్ ని పలకరిస్తాని క్లియర్ గా చెప్పడం అనేది ట్విస్ట్. యాట్కివిటీ రూమ్ – లివింగ్ రూమ్, కన్ఫెషన్ రూమ్ ఇలా ప్రతిచోట ఈ హాలో గ్రామ్ దర్శిని ఉంటుందని చెప్పారు. అది ఈ సీజన్ లో హైలెట్ గా నిలిచింది.
* బెడ్ రూమ్స్ ని డివైడ్ చేశారు. విఐపి, డీలక్స్, స్టాండర్డ్ అంటూ మూడు కేటగిరిలుగా విభజించారు.
* హౌస్ లో ఫర్నీచర్ కోసం టాస్క్ లు ఇచ్చారు. పవర్ అస్త్రం, హలోగ్రామ్ దర్శిని, సెలబ్రిటీలు ఫస్ట్ డే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం వారితో టాస్క్ లు ఆడించడం అనేది ఈ సీజన్ లో హైలెట్స్ గా చెప్పొచ్చు.
మరి ముందు ముందు (Bigg Boss 7 Telugu) ఈ సీజన్ లో నాగార్జున ఎన్ని ట్విస్ట్ లు ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి.