శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘పెద కాపు -1 ‘ అనే సినిమా రూపొందింది. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన మిర్యాల రవీందర్ రెడ్డి.. ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆయన బావమరిది విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్. టీజర్, ట్రైలర్ లు డిఫరెంట్ గా ఉన్నాయి. సెప్టెంబర్ 29 న ఈ సినిమా విడుదల కాబోతుంది. అంతాబాగానే ఉంది కానీ.. ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సెన్సార్ వారు కూడా ఈ టైటిల్ పై అభ్యంతరాలు తెలుపుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఎందుకు అందులో తప్పేముంది అనే డౌట్ అందరికీ రావచ్చు. గోదావరి జిల్లాల్లో ‘పెద కాపు’ అంటే ఓ పెద్ద మనిషి అని అర్ధం వచ్చేలా చెప్పుకుంటారు. కానీ అదే సమయంలో.. ఇది కులాన్ని కూడా రిప్రెజెంట్ చేస్తుంది. అయితే ఏంటి? గతంలో ‘జస్టిస్ చౌదరి’ ‘రాయలసీమ రామన్న చౌదరి’ ‘మాల పిల్ల’ ‘సమరసింహారెడ్డి’ క్షత్రియ పుత్రుడు’ ‘అర్జున్ రెడ్డి’ టైటిల్స్ తో కూడా సినిమాలు వచ్చాయి.
అవి కూడా కులాన్ని రిప్రెజెంట్ చేస్తున్నాయి. అయినా ‘పెద కాపు’ నే చాలా మంది టార్గెట్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏ ఉద్దేశంతో ఈ సినిమాకి టైటిల్ పెట్టినప్పటికీ.. అతను కూడా అదే వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అలాగే గోదావరి జిల్లాల్లో ఎక్కువ శాతం కాపు సామజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉండడం.. శ్రీకాంత్ అడ్డాల కూడా అక్కడివాడే కావడంతో ‘పెదకాపు -1 ‘ ట్రైలర్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఈ టైటిల్ మారే అవకాశం కూడా లేకపోలేదు అని ఇన్సైడ్ టాక్.