The Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్‌’ ఇక్కడ తుస్‌ మనిపించిందా..!

థియేటర్లలో దుమ్ము దులిపిన సినిమా ఓటీటీలోకి వస్తే భారీ విజయం పక్కా అని అనేసుకోవచ్చు. అందాజ్‌గా కోట్ల నిమిషాల స్ట్రీమింగ్‌ లెక్కలు నమోదవుతాయని కూడా అంచనా వేసేసుకోవచ్చు. కానీ ‘కశ్మీరీ ఫైల్స్‌’ విషయంలో ఈ లెక్కలన్నీ పారలేదు అని చెబుతున్నాయి ఓటీటీ వర్గాలు. మే 13న ఈ సినిమా జీ5 వేదికగా వివిధ భాషల్లో విడుదలైంది. ఎక్కడ చూసినా సరైన స్పందన రావడం లేదని చెబుతున్నారు. సినిమాను చూడాలనే ఆసక్తే యూజర్లలో కనిపించడం లేదని చెబుతున్నారు.

మార్చి 11న చిన్న సినిమాగా విడుదలైన ‘కశ్మీరీ ఫైల్స్‌’. భారీ విజయం దక్కించుకుంది. దాని వెనుక రాజకీయ ఆసక్తులు ఉండటం, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలు ఉచిత ప్రచారాలు చేయడం, వినోద పన్ను రాయితీలు ఇవ్వడం, రాజకీయ నాయకులు కామెంట్స్‌… ఇలా వివిధ కారణాల వల్ల సినిమా నిత్యం ప్రజల నోళ్లలో నానింది. అందుకు తగ్గట్టే సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి. సుమారు రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 300 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది.

దీంతో ఓటీటీలో ఈ సినిమా వస్తే దుమ్ము రేగిపోతుంది. మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమాకు ఓటీటీలో సరైన స్పందనే రావడం లేదనేది తాజాగా తెలుస్తున్న విషయం. సినిమా స్ట్రీమింగ్‌ ఆన్‌ చేసి 20 నిమిషాల్లోనే క్లోజ్‌ చేసేస్తున్నారని చెబుతున్నారు. సినిమా డాక్యుమెంటరీ తరహాలో ఉండటం వల్ల ఆ స్లో పేస్‌ నెరేషన్‌ నచ్చక వీక్షకులు క్లోజ్‌ చేస్తున్నారని చెబుతున్నారు.

రెగ్యులర్ సినిమా తరహాలో జోష్ లేకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సగటు ఓటీటీ ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉంటున్నారని టాక్‌. థియేటర్లలో విడుదలైనప్పుడు సినిమాపై వచ్చిన హైప్‌ వల్ల కొంతమంది బిట్స్‌ అండ్‌ పీసెస్‌గా సినిమా చూస్తున్నారట. ఒకేసారి సినిమా మొత్తం చూసేవాళ్లు తక్కువగా ఉన్నారట. తెలుగు వెర్షన్‌ దగ్గరకు వచ్చేసరికి రీచ్ చాలా తక్కువగా ఉందని అంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus