వైరల్ అవుతున్న పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కుటుంబంతో కలిసి కృష్ణాష్టమి పండుగను చక్కగా జరుపుకున్నారు. తల్లితండ్రులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన పూజా హెగ్డే, అనేక పిండివంటలు చేసి భగవంతుడికి నైవేద్యంగా పెట్టారట. తమ కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పూజ పంచుకోగా అవి వైరల్ గా మారాయి. బుట్టబొమ్మ పండుగ సాంప్రదాయ దుస్తులలో అద్భుతంగా ఉంది. స్టార్ హీరోయిన్ అయినా పండగలు, పద్ధతులు విషయంలో అసలు తగ్గడం లేదని నెటిజెన్స్ ఆమెపై ప్రశంశలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం భారీ చిత్రాలు పూజ హెగ్డే చేతిలో ఉన్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో అల వైకుంఠపురంలో మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ఈమె, ప్రభాస్ సరసన రాధే శ్యామ్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుంది. పీరియాడిక్ సెన్సిబుల్ లవ్ డ్రామాగా దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన రాగా, వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే పూజా అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో కూడా నటిస్తుంది.

బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండగా, చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ యంగ్ హీరో ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇంత వరకు హిట్టు మెట్టు ఎక్కని అఖిల్, లక్కీ గర్ల్ పూజ జంటగా హిట్ కొడతాడేమో చూడాలి. ఈ చిత్రం 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది.

1

2


Most Recommended Video

గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus