The Legend Collections: రూ.80 కోట్ల సినిమా.. ఫుల్ రన్లో నష్టం ఎంతో తెలుసా?

ప్రముఖ బిజినెస్ మెన్, కోట్లకు అధిపతి అయిన అరుళ్ శరవణన్‌ 51 ఏళ్ళ వయసులో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘ది లెజెండ్’ అనే పాన్-ఇండియా చిత్రంతో అతను హీరోగా పరిచయమయ్యాడు. ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు నటించారు. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ గ్రాండ్‌ గా రిలీజ్ అయ్యింది.

రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తనే నిర్మించుకున్నాడు శరవణన్. ‘శ్రీ లక్ష్మీ మూవీస్’ సంస్థ పై తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. మొదటి నుండి అరుళ్ శరవణన్ లుక్స్ పై చాలా ట్రోలింగ్ జగడంతో ఈ మూవీ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. సినిమా పై నెగిటివిటీ ఉన్నప్పటికీ కొంతవరకు ఈ జనాలు ఈ మూవీని చూడడానికి వెళ్లారు. కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. ఒకసారి ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.15 cr
సీడెడ్ 0.10 cr
ఆంధ్ర (టోటల్) 0.10 cr
ఏపీ + తెలంగాణ 0.35 cr
తమిళనాడు 6.50 cr
కేరళ 0.20 cr
కర్ణాటక 0.22 cr
బాలీవుడ్ 0.17 cr
ఓవర్సీస్‌ 0.38 cr
వరల్డ్ వైడ్(టోటల్) 7.82 cr

‘ది లెజెండ్’ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.7.82 కోట్లు కలెక్ట్ చేసింది.చాలా వరకు అడ్వాన్స్ బేసిస్ మీదే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి పెట్టిన రూ.80 కోట్ల బడ్జెట్ రికవరీ చేయాల్సి ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఎంత జరిగింది అనే వివరాలు బయటకు రాలేదు.

తమిళ నాడు లో అయితే శరవణన్ స్టోర్స్ లో షాపింగ్ చేసిన జనాలకు ‘ది లెజెండ్’ టికెట్ రేట్లు మరియు స్నాక్స్ కూపన్స్ తో తక్కువ రేట్లకు బహుమతిగా ఇచ్చారు.అయినప్పటికీ ఈ సినిమా ఇంకా 10 శాతం కూడా రికవరీ సాధించలేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ లెక్కలు కాకుండా అయితే.. ఈ మూవీ రూ.70 కోట్లు నష్టాలను మిగిల్చిందని చెప్పొచ్చు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus