తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తుందా?.. అవార్డ్ వరకు ఎందుకులే కానీ అసలు ఆస్కార్‌కి నామినేట్ అవుతుందా?.. ఈ మాటలు ఎవరితోనైనా అంటే.. ‘‘ఏంటి జోకా?.. అది కలలో కూడా జరుగదు’’ అనేసేవారు.. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా ఆస్కార్ సాధించింది.. టాలీవుడ్ సినిమాని పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ఇప్పుడు తెలుగు పాటకి అకాడమీ అవార్డ్ తెచ్చిపెట్టారు.. ఇది అపూర్వ ఘట్టం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పర్వం..
ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాకి కలగానే మిగిలిపోయిన ఆస్కార్ (2023) ని ట్రిపులార్ సాకారం చేసింది.. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను కొల్లగొట్టి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వపడుతున్నారు.. కొద్ది రోజులుగా ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్స్ (2023) కోసం ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది.. ఆ ఉత్కంఠతకు తెరదించుతూ సోమవారం (మార్చి 13) తెల్లవారు ఝామున 95వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది..
ఈసారి రెండు ఇండియన్ సినిమాలు ఆస్కార్ గెలుచుకున్నాయి.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ‘నాటు నాటు’ కి అవార్డులు వచ్చాయి.. ఈ సందర్భంగా ఆస్కార్ గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి..ఇదిలా ఉంటే.. కళా తపస్వి కె. విశ్వనాథ్ క్లాసిక్ ఫిలిం ‘స్వాతిముత్యం’, రాజమౌళి విజువల్ వండర్ మధ్య ఓ ఆసక్తికరమైన పోలిక కుదిరింది..
అదేంటంటే.. 1986 మార్చి 13న రిలీజ్ అయింది.. 2023 మార్చి 13 నాటికి 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. తెలుగు పరిశ్రమ నుంచి అధికారికంగా ఆస్కార్‌కి వెళ్లిన తొలి తెలుగు చిత్రం ‘స్వాతిముత్యం’ విడుదల నాడే టాలీవుడ్‌కి కలగా మిగిలిపోయిన అకాడమీ అవార్డుని ‘ఆర్ఆర్ఆర్’ సాధించడం యాదృచ్చికం.. ఈ సమయంలో విశ్వనాథ్ గారు ఉండుంటే.. ఈ శుభవార్త తెలిసుంటే ఎంతో సంతోషించేవారంటూ సినీ ప్రియులు భావోద్వేగానికి గురవుతున్నారు..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్