వరుణ్, వితిక.. మనకు తెలియని లవ్ స్టోరీ..!

మరో 3 రోజుల్లో ‘వాలెంటైన్స్ డే’ వస్తుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గా. ప్రేమికులందరి సందడి ఎప్పటినుండో మొదలైపోయింది. ఈ క్రమంలో మనం కూడా ఓ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఆ లవ్ స్టోరీ మరెవరిదో కాదు. మన వరుణ్ సందేశ్, వితిక షెరు లది. గతేడాది ‘బిగ్ బాస్3’ సందడి చేసిన ఈ జంట.. వివాహం చేసుకుని 3 ఏళ్ళు పైనే అవుతుంది. వీరిది కూడా ఓ ప్రేమ విహాహమే. అయితే వీరి మధ్యలో ప్రేమ ఎలా పుట్టింది అని వరుణ్ సందేశ్ ను అడిగితే… ‘ముందు పడేసి.. ఆ తర్వాత ప్రేమించాను’ అంటూ సరదాగా సమాధానం చెప్పాడు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ… ” వితిక, నేను.. ‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటించాము. అప్పటికి రెండు నెలలుగా షూటింగ్ జరుగుతున్నా పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఒక సీన్లో నేను వితికాను ఎత్తుకుని పరిగెత్తాలి. ఆ టైములో అనుకోకుండా తనని పడేసి .. నేను కూడా పడిపోయాను. ఆ అమ్మాయి నడుముకి బలమైన దెబ్బ తగిలి ఉంటుందేమో అని తెగ కంగారు పడ్డాను. అప్పటినుండీ రోజూ తనకి ఫోన్ చేసి ఎలా వున్నారని కనుక్కోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది కాస్తా పెళ్ళి వరకూ వెళ్ళింది. ‘అలా ముందు పడేసాను.. తరువాత ప్రేమించాను’ ” అంటూ చెప్పుకొచ్చాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus