Mangalavaaram: మెయిన్ ట్విస్ట్ లీక్ చేసేశారు..వర్కౌట్ అవుతుందా..!

దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో ‘మంగళవారం’ అనే సినిమా రూపొందింది. వీరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘ఆర్.ఎక్స్.100 ‘ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఈ సినిమా పై అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే.. నవంబర్ 17 న రిలీజ్ అయిన ‘మంగళవారం’ సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. మొదటి రెండు రోజులు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వల్ల ఆదివారం కలెక్షన్స్ దెబ్బతిన్నా.. తిరిగి సోమవారం బాగానే కలెక్ట్ చేసి చిత్ర బృందానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దీంతో ‘మంగళవారం’ రోజున సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. ఇది కూడా మంచి ఆలోచనే..! సినిమాకి కలెక్షన్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పుడు.. ఇలాంటి ఈవెంట్లు పెట్టి ఇంకాస్త పుషింగ్ ఇవ్వాలి. ఇక (Mangalavaaram) ఈ ఈవెంట్ కి గెస్ట్ గా మాస్ క దాస్ విశ్వక్ సేన్ ను కూడా ఆహ్వానించారు.

అది కూడా మంచి నిర్ణయమే. కానీ ఈ సక్సెస్ మీట్లో భాగంగా సినిమాలో కీలక ‘మాస్క్’ వెనుక ఉండే నటుడి పాత్రని రివీల్ చేసేశారు. ఆ పాత్ర పోషించింది ప్రియదర్శి. కీలకమైన ట్విస్ట్ ను ఇలా సక్సెస్ మీట్లో లీక్ చేస్తే.. ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తి సన్నగిల్లే ప్రమాదం ఉంది.కానీ మా సినిమాలో ఇంకా ఇలాంటి ట్విస్ట్ లు చాలా ఉన్నాయని టీం ప్రచారం చేసుకోవడం అనేది కూడా మంచి నిర్ణయమనే చెప్పాలి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus