బాహుబలి 2 సమాధానాలు చెప్పాల్సిన 6 ప్రశ్నలు!

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? .. బాహుబలి కంక్లూజన్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది ఒక్కటే కాదు అనేకం ఉన్నాయి. అవి ఏమిటంటే..

1 . బాహుబలి బిగినింగ్ లో శివగామి ప్రాణ త్యాగానికి సిద్దపడుతూ “నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం నా ప్రాణాలయితే తీసుకో” అంటుంది. అయితే శివగామి చేసిన పాపాలు ఏమిటి?
2 . భల్లాల దేవాని నాన్న అని భద్ర పిలుస్తాడు. అయితే అతనికి అమ్మ ఎవరు ?, భల్లాల దేవా భార్య ఎవరు? ఇంకా బతికి ఉందా? చనిపోతే .. ఎందుకు చనిపోయింది?
3 . “నీకు ఏ అవసరం వచ్చినా ఒక్క ప్రాణ మిత్రుడు ఉన్నాడని మరిచి పోకు” అని కట్టప్పతో అసలాం ఖాన్ చెబుతాడు. అంటే అతన్ని కట్టప్ప యుద్ధంలో సాయం కోరుతాడా ? కోరితే ఎవరికీ వ్యతిరేకంగా పోరాడుతారు?
4 . కట్టప్ప తర్వాత మహిష్మతి రాజ్యాన్ని ఎవరు రక్షణగా ఉంటారు?
5 . బాహుబలి సినిమా అయిపోయిన తర్వాత సుబ్బరాజుని చూపిస్తారు. అతని ఎవరు? బాహుబలికి సహాయంగా ఉంటాడా? శత్రువుగా ఉంటాడా?
6 . భల్లా? నీకు ఎప్పుడైనా మీ అమ్మను చంపాలనిపించిందా? .. అని బిజ్జల దేవా అడుగుతాడు. అంటే తన భార్య శివగామిని బిజ్జల దేవా చంపింస్తాడా?
ఈ ప్రశ్నలన్నింటికీ ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న బాహుబలి 2 సమాధానాలు చెప్పాల్సి ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus