Samantha: ఆ వ్యక్తి వల్లే సమంత శాకుంతలం సినిమాలో నటించారా?

సమంత నటించిన శాకుంతలం మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. సమంత ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా సమంత ఒక సందర్భంలో మాట్లాడుతూ దిల్ రాజు వల్లే ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించిన సమయంలో ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ లో నేను నటిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ వెబ్ సిరీస్ పనులతో బిజీగా ఉండటం వల్ల శాకుంతలం సినిమాలో నేను నటించలేనని చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు.

డిస్నీ జానర్ ప్రాజెక్ట్ లలో నటించడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమని సమంత (Samantha) అన్నారు. నాకు బాధ కలిగినా సంతోషం కలిగినా డిస్నీ సినిమాలనే చూస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సినిమాలలో నటించడం నాకు కల అని సమంత కామెంట్లు చేయడం గమనార్హం. శాకుంతలం సినిమాలో మునికన్య రోల్ లో నటించిన సమయంలో ఆ రోల్ కు న్యాయం చేయగలనా అని అనుకున్నానని సామ్ చెప్పుకొచ్చారు.

గడిచిన మూడు సంవత్సరాలలో నాకు ఎదురైన సవాళ్ల వల్ల ఈ విధంగా అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు. ఆ సమయంలో ఇలాంటి గొప్ప పాత్రలో నటించడం కూడా సవాల్ అని అనిపించిందని సామ్ పేర్కొన్నారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజుతో మాట్లాడానని సమంత పేర్కొన్నారు. దిల్ రాజు గారు నాలో ఎంతో నమ్మకాన్ని పెంచారని సమంత చెప్పుకొచ్చారు.

శాకుంతలం సినిమాలో నటించడం ద్వారా నా చిన్నప్పటి కల నెరవేరిందని ఆమె అన్నారు. సమంత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడంతో పాటు శాకుంతలం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. శాకుంతలం సినిమాకు సమంత భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus