సాధారణంగా ఒక సాంగ్ లో ఒక హీరోయిన్ లేదా ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారు. ఒకే సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లు ఉండటం అరుదుగా జరుగుతుంది. యమదొంగ (Yamadonga) సినిమాలో యంగ్ యమ, సోగ్గాడే చిన్నినాయన (Soggade Chinni Nayana) సినిమాలో ఒక సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లు కనిపించడం జరిగింది. అయితే రాజాసాబ్ (The Rajasaab) సినిమాలో ఒకే సాంగ్ లో ప్రభాస్ (Prabhas) ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టెప్పులు వేయనున్నారని తెలుస్తోంది. ఆ సాంగ్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉండనుందని సమాచారం అందుతోంది.
రాజాసాబ్ సినిమా కోసం థమన్ (S.S.Thaman) అద్భుతమైన ట్యూన్లు ఇచ్చారని భోగట్టా. ఈ స్పెషల్ సాంగ్ లో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తో పాటు మాళవిక మోహనన్ (Malavika Mohanan) , రిద్ధికుమార్ (Riddhi Kumar) కూడా కనిపిస్తారని తెలుస్తోంది. మారుతి (Maruthi Dasari) ప్రభాస్ ను ఈ సినిమాలో సరికొత్తగా చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా మారుతి సినిమాలు అంటే లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కుతాయి.
అయితే రాజాసాబ్ మూవీ మాత్రం 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మారుతి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. రాజాసాబ్ సంక్రాంతికి విడుదలైతే చాలా సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
రాజాసాబ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ పారితోషికం 75 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. సినిమాకు ఇచ్చే డేట్లు, ఇతర అంశాల ఆధారంగా ప్రభాస్ పారితోషికం తీసుకుంటున్నారు.