NTR, Boyapati: బోయపాటిని నమ్మి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ రేట్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం దమ్ము సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. సెకండాఫ్ లో కొన్ని పొరపాట్లు జరగడం, క్లైమాక్స్ ఆశించిన విధంగా లేకపోవడం, కామెడీ లేకపోవడం, రిలీజ్ సమయంలో ఈ సినిమా గురించి ఎక్కువగా నెగిటివ్ ప్రచారం జరగడం ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ కు కారణమైందనే సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. బాలయ్యకు మూడు విజయాలు ఇచ్చిన బోయపాటి శ్రీను తారక్ కు మాత్రం సక్సెస్ విషయంలో రుణపడిపోయారనే చెప్పాలి. అయితే ప్రస్తుతం తారక్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. మరీ ప్రయోగాత్మక పాత్రల్లో, ఊరమాస్ పాత్రల్లో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపడం లేదు. అందువల్ల ఈ కాంబినేషన్ లో మరో సినిమా కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ (NTR) రేంజ్ ను మరింత పెంచుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెడుతుండగా ఆ సినిమాలు సైతం మరింత స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తన సినిమాల ద్వారా తారక్ ఆడియన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో మరిన్ని ప్రాజెక్ట్స్ ను సైతం ప్రకటిస్తారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్థాయిలో విజయాలు అందుకోవడంతో పాటు హాలీవుడ్ రేంజ్ లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus