నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. సోషియో ఫాంటసీ కథాంశానికి టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను అప్లై చేసి తీసిన సినిమా ఇది అని ట్రైలర్ చూశాక అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణ.కె ని పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు.మల్లిడి వశిష్ట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మేనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.కళ్యాణ్ రామ్ కెరీర్లో మునుపెన్నడూ లేని విధంగా తన సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఇదిలా ఉండగా.. ఫిక్షన్ ను జోడించి తీసినప్పటికీ ‘బింబిసార’ పాత్ర నిజ జీవితంలో కూడా ఉంది. దీంతో ‘బింబిసార’ ఎవరు? ఆయనకి చరిత్రలో ఉన్న ప్రత్యేక స్థానం ఏంటి? అనే విషయం పై సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి.
విషయంలోకి వెళితే.. ఉత్తర భారతదేశంలో మగధ రాజ్యాన్ని స్థాపించిన మొదటి రాజు బింబిసారుడు. హర్యాంక వంశానికి చెందిన ఈ బింబిసారుడు క్రీస్తుపూర్వం 558 లో జన్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇతను భట్టియా అనే అధిపతి కుమారుడు. 15 సంవత్సరాల వయస్సులోనే సింహాసనాన్ని అధిష్టించిన బింబిసారుడు.. కొన్నాళ్ళకి తన స్థానాన్ని బలోపేతం చేయడానికి కోసల దేవి ని పెళ్ళాడాడు.కోసల దేవి… కోసల రాజు అయిన మహా కోసల కుమార్తె, ప్రసేనజిత్తు సోదరి.
ఆయన వివాహం మగధ, కోసల రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని చెరిపివేసి ఇతర రాజ్యాల తో సంబంధాలను మెరుగు పరచుకోవడానికి ఉపయోగపడింది.అటు తర్వాత ఆయన లిచ్చావి రాజకుమారి అయిన చెల్లన ని వివాహం చేసుకుంది. ఆమె రాజు కేతక కుమార్తె.ఆయన మూడవ భార్య క్షేమ…. మద్రా (పంజాబ్) వంశానికి చెందిన మహిళ. ఉపపత్నులు తో కలిపి ఈయనకి 500 మంది భార్యలు అని తెలుస్తుంది. మగధ రాజ్య సింహాసనాన్ని అధిరోహించడానికి ఆయన కుమారుడు అజాతశత్రు ఆయనను ఖైదు చేసినట్టు తెలుస్తుంది.
అజాతశత్రు తన మొదటి బిడ్డ పుట్టిన తరువాత తండ్రి ని విడుదల చేయాలని ఆదేశించాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. బింబిసారా అప్పటికే మరణించడం జరిగింది. ఇలాంటి చారిత్రాత్మక కథాంశాన్ని తీసుకుని డెవలప్ చేసి సినిమాగా ఆవిష్కరించడం అంటే అంత ఈజీ మేటర్ కాదు. అందుకే ‘బింబిసార’ ని అందుకే ఫ్రాంచైజీగా 4 పార్ట్ లతో రూపొందించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది.