ఈ మధ్య బయట ఎక్కువగా వినిపించిన లేదా వినిపిస్తున్న సినిమా పాటలు ఏమైనా ఉన్నాయా? అంటే అవి ‘ఖుషి’ సినిమాలోని పాటలు అనే చెప్పాలి. ‘నా రోజా నువ్వే’ ‘ఆరాధ్య’ ‘ఖుషి’ వంటి పాటలు అన్నీ చార్ట్ బస్టర్లే. ఈ సినిమాకు ఇంత అద్భుతమైన సంగీతాన్ని అందించింది హేషమ్ అబ్దుల్ వాహబ్. ఇతను మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘హృదయం’ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆ సినిమాలో ‘దర్శన’ అనే పాట ఎంత పెద్ద చార్ట్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ పాటకి ఇంప్రెస్ అయిపోయే దర్శకుడు శివ నిర్వాణ తన (Kushi) ‘ఖుషి’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పట్టుబట్టి తెచ్చుకున్నాడు. అయితే ఇతనికి ‘పుష్ప’ సినిమాలో విలన్ అయిన ఫహాద్ ఫాజిల్ కి రిలేషన్ ఉంది అని బహుశా ఎక్కువమందికి తెలిసుండదు. విషయం ఏంటంటే.. హేషమ్ అబ్దుల్ వాహబ్ … ఫహాద్ ఫాజిల్ కి దగ్గరి బంధువు. వరుసకు హేషమ్.. ఫహాద్ ఫాజిల్ కి సోదరుడి వరస అవుతాడు. హేషమ్ సినిమాల్లోకి రావడానికి ఫహాద్ ఫాజిల్ సపోర్ట్ కూడా ఉందని తెలుస్తుంది.
ఇంకో విషయం ఏంటంటే.. విచిత్రంగా ఫహాద్ ఫాజిల్ ను, అలాగే అతని భార్య నజ్రియాని, ఇప్పుడు హేషమ్ ను టాలీవుడ్ కి తీసుకొచ్చింది మైత్రి మూవీ మేకర్స్ వారే. ‘పుష్ప’ తో ఫహాద్ ను, ‘అంటే సుందరానికీ’ చిత్రంతో నజ్రియాని, ‘ఖుషి’ తో హేషమ్ ను ..వారు టాలీవుడ్ కి తీసుకొచ్చినట్టు అయ్యింది.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!