Sreeja, Allu Arjun: బన్నీ- శ్రీజ కాంబినేషన్ అలా మిస్ అయ్యిందట..!

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ షూటింగ్లో ఉన్నారు. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో దానికి రూ.1000 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. ఆ విషయాన్ని అటుంచితే.. అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చింది ‘గంగోత్రి’ సినిమాతో..! వాస్తవానికి.. ఈ సినిమా రాంచరణ్ తో చేయాలని కె.రాఘవేంద్రరావు – అశ్వినీదత్ అనుకున్నారు. ఇదే విషయాన్ని చిరంజీవి వద్ద ప్రస్తావించగా.. ఆయన కథ విని.. ఇప్పుడు వద్దు అనేశారు.

చరణ్ ను మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా పరిచయం చేయాలని చిరు భావించి ఆ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ ను రంగంలోకి దింపారు. అలాగే హీరోయిన్ విషయంలో కూడా చాలా ఆప్షన్లు చూశారు రాఘవేంద్రరావు – అశ్వినీదత్ లు..! ఈ క్రమంలో అల్లు అరవింద్ .. శ్రీజని (Sreeja) హీరోయిన్ గా పరిచయం చేద్దామని చిరు వద్ద ప్రస్తావించారట. అందుకు కూడా చిరు ఒప్పుకోలేదు.

తన కూతుర్లని నటనకు దూరంగా ఉంచాలని ఆయన నిర్ణయించుకున్నారట. అలా ‘గంగోత్రి’ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ శ్రీజ మిస్ చేసుకుంది. ఆమెకు కూడా హీరోయిన్ గా నటించాలనే కోరిక ఉన్నప్పటికీ .. ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది. ఇక ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వారిద్దరితో హ్యాపీగా జీవిస్తుంది. సోషల్ మీడియాలో కూడా తన కూతుర్లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus