Ghaati: ‘ఘాటి’ వాయిదా వెనుక ఇంత కథ ఉందా.. అసలు మేటర్ ఇదే..!

స్టార్ హీరోయిన్ అనుష్క (Anushka) కొన్నాళ్ల నుండి సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆమె చేసే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి రూ.40 కోట్ల మార్కెట్ ఉన్నా.. సినిమాకు రూ.10 కోట్ల చొప్పున పారితోషికం ఇస్తామని దర్శకనిర్మాతలు వెంటపడినా ఆమె క్యాష్ చేసుకోవాలని చూడడం లేదు. నచ్చిన కథలకే ఓకే చెబుతుంది. ఆమె ప్రస్తుతం ‘ఘాటి’ (Ghaati)లో నటిస్తుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సమ్మర్లోనే రిలీజ్ కావాలి కానీ జూలైకి వాయిదా వేశారు.

Ghaati

ఇప్పుడు జూలై రేస్‌ నుండి కూడా తప్పుకుంది ‘ఘాటి’. మరి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారింది. ‘ఘాటి’ (Ghaati) సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉందట. దీనికోసమే నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్నాళ్ల నుండి అనుష్క భారీ కాయంతో నటించడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే స్నేహితులైన ‘యూవీ క్రియేషన్స్’ లో తప్ప వేరే బ్యానర్లో ఆమె సినిమాలు చేయడం లేదు.

సన్నబడడానికి చాలా సార్లు సర్జరీలు వంటివి చేయించుకున్నా ఫలితం దక్కడం లేదు. అందుకే ‘ఘాటి’ లో ఆమెను సన్నగా చూపించడానికి కూడా వి.ఎఫ్.ఎక్స్ ను నమ్ముకున్నారట. స్క్రీన్‌పై ఆమె లుక్స్ ని మెరుగుపరచేందుకు అది తప్ప నిర్మాతలకు మరో ఆప్షన్ లేదు. కేవలం అనుష్క లుక్స్ కోసమే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కి ఎక్కువ టైం పడుతుందట.

అందుకే దర్శకుడు క్రిష్, నిర్మాతలు జూలై 18 నుండి ‘ఘాటి’ ని తప్పించినట్టు స్పష్టమవుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విషయంలో కూడా యూవీ వారు ఇదే ఫార్ములా అప్లై చేశారు. అంతకు ముందు ‘రాధే శ్యామ్’ సినిమాలో కూడా ప్రభాస్ లుక్స్ ని ఇలాగే మేనేజ్ చేయడం జరిగింది.

మాస్టారూ.. ఎక్కడ, ఏం మాట్లాడుతున్నామో మరచిపోయి మాట్లాడితే ఎలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus