NTR: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్ దూరం అవ్వడానికి అదే కారణమా?

స్వర్గీయ నందమూరి తారక రామారావుశత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మే 28వ తేదీ ఎన్టీఆర్ శతజయంతి కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ వేడుకలను సెలెబ్రేట్ చేస్తున్నారు. గతంలో విజయవాడలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంతో మంది రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు హాజరు కానున్నారు.

ఇక ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను హైదరాబాద్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానాలను పంపించారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సైతం శతజయంతి వేడుకలకు పాల్గొనాలి అంటూ ఆహ్వానం అందిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పాల్గొనడం లేదు అంటూ అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడానికి కారణం లేకపోలేదు.

ఎన్టీఆర్ (NTR) శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్న ఈరోజే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఈయన ముందుగానే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లాలని నిర్ణయించుకొని వెకేషన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట అందుకోసమే తాను ఈ వేడుకకు హాజరు కాలేకపోతున్నాను. ఇందుకు ఆయన ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఆహ్వాన సమయంలోనే ఆర్గనైజింగ్ కమిటీకి ఇదే విషయాన్ని తారక్‌ చెప్పారు అని జూనియర్‌ ఎన్టీఆర్ టీం ఈ విషయాన్ని వెల్లడించారు.

హైదరాబాద్లో జరిగే ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు అయినటువంటి పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, కన్నడ హీరో శివ రాజకుమార్‌, జయప్రద, అశ్వనీదత్‌ సహా పలువురు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే తారక్ కేవలం తన పుట్టినరోజు కారణంగా ముందుగా ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ కారణంగా మాత్రమే ఈ వేడుకలకు హాజరు కాలేదని తెలుస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus