Niharika: నిహారిక సినిమాలలో సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనా?

నిహారిక కొణిదెల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న ఈమె కెరీర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నిహారిక అనంతరం మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డాటర్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె హీరోగా ఒక మనసు సూర్యకాంతం హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలలో నటించారు.

ఈ విధంగా నిహారిక పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమె సక్సెస్ కాలేకపోయారు. మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇవ్వడం మెగా అభిమానులకు నచ్చకపోవడం వల్లే ఈమె హీరోయిన్ గా సక్సెస్ కాలేదని తెలుస్తోంది.ఇలా హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో నిహారిక పలు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే 2020 డిసెంబర్ 9 న నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఈ వివాహం అనంతరం తన భర్తకు నిహారిక సినిమాలలో నటించడం ఇష్టం లేకపోవడంతో ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లను నిర్వహిస్తూ ఉన్నారు.ఇకపోతే వివాహమైనప్పటికీ నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ నిత్యం గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈమె పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడం చూస్తుంటే నిహారిక తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.అయితే ఈమె హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా పలు కీలక పాత్రలలో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా ఒక వైపు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు నటిగా రాణించాలనే ఆలోచనలో నిహారిక ఉన్నట్లు తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus