‘సీతా రామం’ సక్సెస్ మీట్ కు దూరంగా సుమంత్… కారణం..!

‘సీతా రామం’ చిత్రం గత వారం అంటే ఆగస్టు 5న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించి ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుందనే చెప్పాలి. రామ్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. ఇక సీతా మహాలక్ష్మి పాత్రలో మృణాల్ ఠాకూర్ కూడా మంచి నటన కనపరిచింది. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా రష్మిక, సుమంత్ ల పాత్రలకు చాలా మంచి పేరు లభించింది. సుమంత్ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. హీరోగానే కాకుండా.. విలక్షణ నటుడిగా కూడా రాణించాలి అని తహతహలాడుతున్నాడు.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంతో ఓ ప్రయత్నం చేసినా.. అతని పాత్రకు మంచి మార్కులు పడ్డాయి కానీ, సినిమా సక్సెస్ కాకపోవడంతో జనాలు అతని పాత్రను ఎక్కువ కాలం గుర్తుంచుకోలేదు. అయితే ‘సీతా రామం’ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రను అతను పోషించాడు. హీరో గొప్పతన్నాని ఒప్పుకోకుండా అతనితో కోల్డ్ వార్ నడిపే వ్యక్తిగా అతను కనిపించాడు. ఇక క్లైమాక్స్ లో ఫ్యామిలీ కోసం దేశానికి, రామ్ కి తప్పని పరిస్థితుల్లో అన్యాయం చేసే వ్యక్తిగా అతను కనిపిస్తాడు. ఇతని పాత్ర వల్లే కథ మొత్తం తారుమారు అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు జరిగిన ‘సీతా రామం’ సక్సెస్ మీట్ కు సుమంత్ రాలేదు. కానీ అతని మావయ్య నాగార్జున అతిధిగా వచ్చాడు.

సుమంత్ ఎందుకు ఈ వేడుకకు రాలేదు అన్న విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.ఊహించని విధంగా అతను కోవిడ్‌ బారిన పడడంతో ఈ ఈవెంట్‌కు అతను రాలేకపోయాడట.ఈ క్రమంలో సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అలాగే సక్సెస్‌ మీట్‌కు హాజరైన తన చిన్న మావయ్యకి(నాగార్జున) స్పెషల్ థాంక్స్ తెలియజేశాడు. మరోపక్క సుమంత్‌ హీరోగా రెండు సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus