Krishnam Raju: కృష్ణంరాజు కోరిక ప్రకారమే అంత్యక్రియలు అక్కడ జరిగాయా?

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్తులైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి చెందడంతో ఒక్కసారిగా సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రపంచం ఒక్కసారిగా తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం తన ఫామ్ హౌస్ లో జరిగిన సంగతి మనకు తెలిసిందే.

ముందుగా అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగాలని భావించారు. అయితే చివరికి ఈయన అంత్యక్రియలు తన ఫామ్ హౌస్ లో జరగడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది. కనకమామిడి ఫామ్ హౌస్ అంటే కృష్ణంరాజు గారికి ఎంతో ఇష్టమట. మరికొద్ది రోజులలో ఇక్కడ తన ఇష్ట ప్రకారమే ఒక ఫామ్ హౌస్ నిర్మించుకొని ఇక్కడే ఉండాలని ఆయన భావించారట. మరి కొద్ది రోజులలో ఈ ఫామ్ హౌస్ నిర్మాణం పూర్తి అవుతుందన్న సమయంలోనే కృష్ణంరాజు మృతి చెందడంతో ఆయన కోరిక అలాగే ఉండిపోయింది.

అయితే కృష్ణంరాజు గారు బ్రతికున్న సమయంలో తరచూ తాను చనిపోతే కనుక తన ఫామ్ హౌస్ లోనే అంత్యక్రియలు చేయాలని అక్కడే ఉంటూ తన ఇంటిని చూసుకుంటూ ఉంటానని చెప్పేవారట. ఇలా బ్రతికున్నప్పుడు తన అంత్యక్రియలు అక్కడే జరగాలని చెప్పడంతో ఆయన ఇష్ట ప్రకారమే

చివరి నిమిషంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగాల్సిన కృష్ణంరాజు అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో జరిపించారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా జరిగాయి. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు అభిమానుల ఆశ్రనయనాల నడుమ కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus