Samantha: సమంత టీమ్‌ క్లారిటీ ఇవ్వొచ్చుగా.. ఏవేవో అంటున్నారు!

సమంత ఎక్కడ? ఈ మధ్య కనిపించడం లేదే? అసలు ఈ దేశంలో ఉందా? విదేశాలకు వెళ్తోందా? లేకపోతే ఇప్పటికే విదేశాలకు వెళ్లిందా? వెళ్తే ఎందుకు వెళ్లింది? ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు ఈ మధ్య సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. మొన్నీమధ్య ఇలాంటి పుకార్లను కంట్రోల్‌ చేసే క్రమంలో సమంత మేనేజర్‌ మాట్లాడారు. అయితే క్లారిటీ వస్తుందేమో అనుకుంటే.. ఇంకాస్త కన్‌ఫ్యూజన్‌ వచ్చింది. కొంతమంది సమంత అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లింది అంటుంటే.. ఇంకొందరు శిక్షణ కోసం వెళ్లింది అంటున్నారు.

పెళ్లికి ముందు సమంత వరుస అవకాశాలతో దూసుకుపోయింది. ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. అప్పుడప్పుడు కాన్సెప్ట్‌ బేస్డ్‌, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ వచ్చింది. రిలేషన్‌ బ్రేకప్‌ తర్వాత వేగం పెంచినట్లు కనిపించింది. ఓటీటీ అవకాశాలు, బాలీవుడ్‌ అవకాశాలు కూడా వచ్చాయి. ఇక సమంత జోరు మామూలుగా ఉండదు అని అనుకుంటుండగా.. ఒక్కసారి కొత్త సినిమాలను ఓకే చేయడం ఆపేసింది. దీంతో సామ్‌కి ఏమైంది అని అన్నారు.

అప్పుడే సమంత అనారోగ్యం గురించి సమాచారం బయటకు వచ్చింది. చర్మ సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతోందని సన్నిహితుల సమాచారం. దీనికి చికిత్స కోసమే ఆమె విదేశాలకు వెళ్లింది అంటున్నారు. అయితే ఇదంతా కరెక్ట్‌ కాదని, ఆమె ఓకే చేసిన ఓ బాలీవుడ్‌ సినిమా కోసం శిక్షణ కోసమే విదేశాలకు వెళ్లింది అని అంటున్నారు. వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలో రూసో బ్రదర్స్‌ నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌ ఇదే. ‘సిటాడెల్’ అనే అంతర్జాతీయ సిరీస్‌కు ఇది రీమేక్‌. రాజ్‌ అండ్‌ డీకే రూపొందిస్తారట.

ఈ కొత్త వెబ్‌ సిరీస్‌లో సమంత స్పై పాత్రలో కనిపించనుందట. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సిరీస్‌ తెరకెక్కనుందట. ఇందులో సమంత పాత్రకు యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయట. వాటి గురించి ఇప్పుడు సమంతఅమెరికాలో నిపుణుల సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటోంది అంటున్నారు. దీని కోసం ఆమె కఠినమైన డైట్‌ను కూడా ఫాలో అవుతోందని చెబుతున్నారు. అందుకోసమే వెళ్లింది అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus