స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. స్కంద సినిమాతో బోయపాటి శ్రీను మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారని అందరూ భావించగా ఈ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. బోయపాటి శ్రీను ఊరమాస్ సినిమాలను తెరకెక్కించడం వల్ల యంగ్ జనరేషన్ హీరోలు ఆ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. క్లాస్ హీరోలతో ఊరమాస్ సినిమాలు తీయడంతో పాటు, యాక్షన్ సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా లేకపోవడం బోయపాటి శ్రీనుకు మైనస్ అవుతోంది.
దమ్ము, జయ జానకి నాయక, వినయ విధేయ రామ, స్కంద సినిమాలు ఫ్లాప్ కావడానికి ఇదే కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బోయపాటి శ్రీను ఒకే తరహా కథ, కథనంతో సినిమాలను తెరకెక్కించడానికి దూరంగా ఉండాలి. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ లా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా సినిమాలను తెరకెక్కించే విషయంలో బోయపాటి శ్రీను ఫెయిల్ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్లు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న తరుణంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బోయపాటి శ్రీను ముందడుగులు వేయాల్సి ఉందని చెప్పవచ్చు. బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను సక్సెస్ ట్రాక్ తో సంబంధం లేకుండా ఛాన్స్ ఇవ్వడానికి బాలయ్య ముందువరసలో ఉంటారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ2 సినిమా వచ్చే ఏడాది మొదలుకానుందని సమాచారం అందుతోంది.
బాలయ్య బోయపాటి (Boyapati Srinu) కాంబో ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. బోయపాటి శ్రీను రేంజ్ ను మరింత పెంచే ప్రాజెక్ట్ లను ఎంచుకోవాల్సి ఉంది. బోయపాటి శ్రీను యంగ్ జనరేషన్ ఆడియన్స్ టేస్ట్ కు అనుగుణంగా సినిమాలను ఎంచుకోవాల్సి ఉంది.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !