Samantha: సమంతలో వచ్చిన మార్పుల వెనుక కారణం ఇదేనా?

స్టార్ హీరోయిన్ సమంత వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నా ఆ సినిమాల షూటింగ్ లు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి. ఖుషి సినిమా షూట్ లో ఈ నెల నుంచి పాల్గొంటానని సమంత చెప్పినా ఆమె ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదని తాజాగా విడుదలైంది. వచ్చే నెలలో సమంత నటించిన శాకుంతలం మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంతలం ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అల్లు అర్హ ఈ సినిమాలో నటిస్తుండటంతో అల్లు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సమంత గతంతో పోలిస్తే చాలా మారారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంతలో వచ్చిన మార్పులకు జగ్గీస్ వాసుదేవ్ కారణమని సమాచారం అందుతోంది. సమంత సమంత జపమాల వెనుక అసలు కారణం ఇదేనని తెలుస్తోంది. మానసిక ఆరోగ్యంపై సమంత స్పెషల్ ఫోకస్ పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత ప్రతిరోజూ శ్లోకాలను జపిస్తున్నారని బోగట్టా.

సమంత యశోద సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా శాకుంతలం సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రికార్డ్ స్థాయి థియేటర్లలో శాకుంతలం మూవీ రిలీజ్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. శాకుంతలం సినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

దాదాపుగా 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. శాకుంతలం సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని త్రీడీలో ఈ సినిమాను చూస్తే పొందే అనుభూతి మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సమంత త్వరగా కోలుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus