Dasara: ఆ ఒక్క రీజన్ వల్లే సీడెడ్ లో కలెక్షన్లు తగ్గాయా?

నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా 87 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో నైజాంలో ఈ సినిమాకు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి. సినిమాలోని ట్విస్టులకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీడెడ్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు ఆశాజనకంగా లేవు.

సాధారణంగా మాస్ సినిమాలు ఏ సెంటర్లలో ఆశాజనకంగా కలెక్షన్లను సాధించవు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. తొమ్మిది కోట్లకు దిల్ రాజు ఈ సినిమా హక్కులు తీసుకోగా రెట్టింపు స్థాయిలో ఈ సినిమా లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణలో ఈ సినిమా మెరుగ్గా కలెక్షన్లను సాధిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత నిర్మాత సుధాకర్ చెరుకూరికి ఈ సినిమాతో మరో సక్సెస్ దక్కింది.

కొన్ని పదాలు అర్థం కాని విధంగా ఉండటం, సీడెడ్ ప్రేక్షకులకు దసరా (Dasara) తరహా సినిమాలు కొత్త కాకపోవడం వల్ల కూడా ఈ సినిమా అక్కడ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని సమాచారం అందుతోంది. నాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా నాని నటుడిగా సినిమా సినిమాకు ఎదుగుతున్నారు. క్రిటిక్స్ సైతం మెచ్చే తరహా పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ విషయంలో నాని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

భారీ స్థాయిలో పబ్లిసిటీ చేయడం ఈ సినిమాకు కలిసొచ్చింది. నాని పారితోషికం 25 కోట్ల రూపాయలకు చేరినట్టేనని కొత్త ప్రాజెక్ట్ లు నాని మార్కెట్ ను రెట్టింపు చేస్తాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇతర హీరోలకు భిన్నంగా వరుస విజయాలు దక్కేలా నాని కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus