Dhanush: ధనుష్ ఎంట్రీ వెనుక అసలు కథ ఇదా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ధనుష్ గత సినిమా జగమే తంత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజై డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ హీరోగా టాలీవుడ్ లో రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలలో ఒక సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా మరో సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ లో భారీగా క్రేజ్ ఉన్న ధనుష్ కు పాన్ ఇండియా హీరోగా ఇప్పటికే గుర్తింపు ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు భారీగా పారితోషికం పెంచేసిన నేపథ్యంలో కొందరు స్టార్ హీరోలకు చెక్ పెట్టేందుకు టాలీవుడ్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలుగులో కొంతమంది స్టార్ హీరోలు తీసుకుంటున్న పారితోషికంలో ధనుష్ పారితోషికం సగం అని అందుకే టాలీవుడ్ పెద్దలు ధనుష్ పై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ధనుష్ సినిమాలకు తమిళంలో, హిందీలో భారీగా క్రేజ్ ఉన్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు ధనుష్ కు తెలుగులో మార్కెట్ ను క్రియేట్ చేయడంలో సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

టాలీవుడ్ పెద్దలు ధనుష్ ను దించి చెక్ పెట్టాలనుకుంటున్న స్టార్ హీరోల వివరాలు తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. కోలీవుడ్ హీరో విజయ్ కూడా తెలుగులో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కొంతమంది తమిళ హీరోలు టాలీవుడ్ లో సక్సెస్ కావాలనే ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. ధనుష్, విజయ్ టాలీవుడ్ లో మార్కెట్ ను పెంచుకోవడంలో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus