యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. అతి త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజైన రెండు వారాల వరకు మరో సినిమా విడుదల కాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని ఆర్ఆర్ఆర్ రిలీజైన రెండు వారాల తర్వాత థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తారక్ తర్వాత మూవీ షూటింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైందని అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ పనులు ఆలస్యం కావడం వల్లే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని సమాచారం. కొరటాల శివ సోషల్ మీడియాలో లేకపోవడంతో ఈ సినిమా గురించి అభిమానులకు ఎలాంటి అప్ డేట్స్ తెలియడం లేదు.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కొరటాల శివ వేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి కుదిరితే ఈ ఏడాది కుదరని పక్షంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలోపు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా తారక్ గుర్తింపును సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కే విధంగా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.