చరణ్, తారక్ డ్యాన్స్ వెనుక ఇంత కథ జరిగిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన డ్యాన్సర్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు కాలు కదిపితే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే అనే సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై తారక్, చరణ్ డ్యాన్స్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరు హీరోలు ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చేయడానికి దూరంగా ఉన్నారు. అయితే చరణ్, తారక్ డ్యాన్స్ చేయకపోవడానికి అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి.

ఆస్కార్ అకాడమీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా నాటు నాటు తెర వెనుక కథను వెల్లడించింది. ఆస్కార్ కమిటీ చరణ్, తారక్ లను లైవ్ పర్ఫామెన్స్ అడగగా రిహార్సల్స్ కు తగినంత టైమ్ లేదని ఆస్కార్ కమిటీకి చరణ్, తారక్ చెప్పారు. స్టేజ్ పై చేసే సమయంలో ఏ చిన్న తప్పు చేసినా నెగిటివ్ కామెంట్లు వస్తాయి. ఈ రీజన్ వల్లే తారక్, చరణ్ డ్యాన్స్ చేయలేదు. ప్రాక్టీస్ కు టైమ్ దొరికి లైవ్ లో చరణ్, తారక్ డ్యాన్స్ చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండేది.

ఆర్.ఆర్.ఆర్ మూవీ సీక్వెల్ ఉంటుందని ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే స్క్రిప్ట్ ఫైనల్ అయితే మాత్రమే జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రాజమౌళి మాత్రమే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించే సినిమాలను తెరకెక్కించగలరని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి రెమ్యునరేషన్ 200 కోట్ల రూపాయల రేంజ్ కు చేరిందని కామెంట్లు వినిపిస్తుండగా ఈ కామెంట్లలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆయన మార్కెట్ హాలీవుడ్ డైరెక్టర్లను మించి పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి ఇతర భాషల హీరోలు, హీరోయిన్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus