యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి గత రెండు రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. నారా లోకేశ్ కామెంట్ల నేపథ్యంలో తారక్ రాజకీయాల్లో యాక్టివ్ అయితే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెన్స్ అందరినీ తెగ టెన్షన్ పెడుతోంది. తారకరత్న మరణం వల్ల ఎన్టీఆర్ అమెరికాకు కూడా వెళ్లలేదు. పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ ప్రస్తుతం కెరీర్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలతో సోలో హీరోగా తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు. అనవసర వివాదాలకు, విమర్శలకు అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదని తారక్ భావిస్తున్నారు. సినిమాల బడ్జెట్లు పెరగడంతో సినిమాల ఎంపికలో తారక్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన మాత్రం తారక్ కు లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు తారక్ కు ఒకింత చిరాకు తెప్పిస్తున్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమా అవుతుందని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. హీరోయిన్ల ఎంపికలో తారక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుండగా ఎన్టీఆర్30 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు మార్చి నెల 6వ తేదీన అధికారక ప్రకటన రానుంది.
మార్చి 3వ వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనుండగా మార్చి 20వ తేదీ నుంచి ఈ సినిమా షూట్ మొదలుకానుంది. తారక్ ఈ సినిమా షూటింగ్ ను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారని తెలుస్తోంది. 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.